breaking news
Aishwarya Pisse
-
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
తెలుగు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి ఐశ్వర్య పిస్సే షాకింగ్ పోస్ట్ పెట్టింది. తాను విడాకులు తీసుకున్న విషయాన్ని ధ్రువీకరించింది. 'నా పేరు మీనాక్షి' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. 'అగ్నిసాక్షి'తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తర్వాత తెలుగు, తమిళ, కన్నడలో హీరోయిన్గా బిజీగా మారిపోయింది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)కెరీర్ పీక్స్ ఉన్న టైంలో అంటే 2019లో సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి అన్నయ్య హరి వినయ్‌ని ఐశ్వర్య వివాహమాడింది. దాదాపు ఏడేళ్లపాటు కలిసున్న వీళ్లు గత ఏడాది కాలంగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వార్తలు రాగా వాటిపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య.. సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.'మేం ఇద్దరం గత ఏడాదిన్నర కాలంగా విడివిడిగా నివసిస్తున్నాం. చాలాసార్లు ఆలోచించిన తర్వాతే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. ఇది మా ఇద్దరి వ్యక్తిగత నిర్ణయం. ఈ కష్టసమయంలో మా మనశ్శాంతి, వ్యక్తిగత గోప్యత గౌరవించాలని అభిమానులను, శ్రేయోభిలాషులను కోరుతున్నాను. దయచేసి మా నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుని ఆమోదించాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను''ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, సీరియల్ సన్నివేశాలను సందర్భం లేకుండా వాడుకోవడం లేదా నా వ్యక్తిగత పరిస్థితిని దుర్వినియోగం చేయడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో నా ఫోటోలని పోస్ట్ చేసేవాళ్లు నా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించాలి. తప్పుడు వార్తలు వ్యాప్తి చేయొద్దు. సీరియల్ సన్నివేశాలకు నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. నా వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతీసేలా లేదా తప్పుడు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోను' అని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: 'రణబాలి' సెన్సార్ రివ్యూ.. రన్ టైమ్ ఎంతంటే?) -
నాన్న మమ్మల్ని వదిలేస్తే.. మా కోసం అమ్మ పడిన కష్టం వర్ణనాతీతం : ఐశ్వర్య (ఫోటోలు)
-
ఎఫ్ఐఎం ఇ–ఎక్స్ప్లోరర్లో భారత జట్టు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మోటార్ సైక్లింగ్ సమాఖ్య (ఎఫ్ఐఎం) నిర్వహించే ప్రతిష్టాత్మక ఇ–ఎక్స్‌ప్లోరర్ ఈవెంట్లో తొలిసారి భారత జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. 2024 సీజన్లో భారత్‌కు చెందిన ‘ఇండి రేసింగ్’ టీమ్ బరిలోకి దిగుతుంది. అధికారికంగా ఎఫ్ఐఎం అనుమతించిన రేసింగ్ పోటీల్లో పాల్గొనే తొలి టీమ్ ‘ఇండి రేసింగ్’ అవుతుంది. ఈ జట్టు యజమాని కంకణాల అభిశేక్ రెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. తాజా సీజన్ రేస్‌లు జపాన్‌లో వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతాయి. నవంబర్‌లో హైదరాబాద్‌లోనే రేసింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇండి రేసింగ్ టీమ్ తరఫున ఐశ్వర్య పిస్సే, స్పెన్సర్ విల్టన్, సాండ్రా గోమెజ్ పోటీ పడతారు. భారత్‌లో మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఇటీవల చాలా పెరిగిందని, అయితే పోటీల్లోకి వచ్చేసరికి మన టీమ్‌కు ప్రాతినిధ్యం లేదని కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అభిశేక్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తమ జట్టు ఇండి రేసింగ్ ఆ అవకాశం కలి్పస్తుందని, ఎక్కువ మంది దీనివైపు మళ్లేలా తమ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు.


