breaking news
Airfare
-
మహా కుంభమేళా ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025(Maha Kumbh 2025) ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు ఛార్జీలను గణనీయంగా పెంచేశాయి. ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టిక్కెట్లు(roundtrip tickets) రూ.50,000 వరకు చేరుకున్నాయి. డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా టికెట్ ధరలను నియంత్రించాలని, ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలను ఆదేశించింది.ముందున్న శుభదినాలు..జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి, ఫిబ్రవరి 12న మాఘీ పూర్ణిమ, 26న మహా శివరాత్రి వంటి పుణ్యస్నానాల కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు భారీగా ఛార్జీలు పెంచుతున్నాయి. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టికెట్ల ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. నగరాన్నిబట్టి సాధారణ టికెట్లు రూ.50,000 వరకు చేరుకున్నాయి.డీజీసీఏ స్పందన..పెరుగుతున్న ఛార్జీలకు ప్రతిస్పందనగా డీజీసీఏ 2025 జనవరి 23న విమానయాన ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఛార్జీల హేతుబద్ధీకరణ, విమానాల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు ప్రయాణించేందుకు డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌కు మొత్తం విమానాల సంఖ్య 132కు చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే లక్ష్యంగా ఈ చర్యకు పూనుకుంది.ఇదీ చదవండి: స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభంప్రయాణికులపై ప్రభావం..దేశవిదేశాల నుంచి యాత్రికులను ఆకర్షించే మహా కుంభమేళా ఉత్సవానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. అధిక రద్దీ కారణంగా విమాన ఛార్జీలు పెరిగాయి. స్థానికంగా వసతికి కూడా డిమాండ్ అధికమవుతుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం మొదటిసారి రాత్రి సమయాల్లోనూ అంతర్జాతీయ విమానాలు నడుపుతూ రికార్డు స్థాయిలో ప్రయాణీకుల రద్దీని నిర్వహిస్తోంది. -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
ఇండిగో మాన్సూన్ స్పెషల్ : టిక్కెట్ ధరెంతంటే..
చెన్నై : చౌక ధరల్లో విమానటిక్కెట్లను అందించే విమానయానసంస్థ ఇండిగో మూడు రోజుల మాన్ సూన్ స్పెషల్ సేల్ ఆఫర్ ను తీసుకొచ్చేసింది. ఈ స్పెషల్ సేల్ ఆఫర్ కింద రూ.899కే టిక్కెట్ ధరను విక్రయిస్తోంది. జూన్ 12 నుంచి జూన్ 14 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఇండిగో తెలిపింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాలకు ఈ టిక్కెట్లు వర్తిస్తాయని పేర్కొంది. ముంబై-గోవా, జమ్ము-అమృత్ సర్, ఢిల్లీ-ఉదయ్ పూర్, అహ్మదాబాద్-ముంబై, చెన్నై-పోర్టు బ్లయిర్, హైదరాబాద్-ముంబై, కోల్ కత్తా-అగర్తల, ఢిల్లీ-కోయంబత్తూర్, గోవా-చెన్నై వంటి ఎంపికచేసిన మార్గాలకు ఈ టిక్కెట్ ధరలను ఆఫర్ చేయనుంది. అయితే ఈ స్పెషల్ ధరల ఆఫర్ ఫస్ట్-కమ్-ఫస్ట్ బేసిస్ లో అందుబాటులో ఉంచుతామని, ఒక్కసారి టిక్కెట్ బుక్ చేసుకున్నాక అవి మళ్లీ ఆ మొత్తాన్ని రీఫండ్ చేయమని ప్రకటన విడుదల చేసింది. సమ్మర్ స్పెషల్ సేల్ కు మంచి స్పందన రావడంతో, మూడు రోజుల ఈ మాన్ సూన్ సేల్ స్పెషల్ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. చెన్నైతో కనెక్ట్ అయ్యే కొన్ని రూట్ల టిక్కెట్లు ఈ విధంగా ఉన్నాయి..ముంబై-చెన్నై రూ.1,999కు, ఢిల్లీ-చెన్నై కు రూ.3,399కు, బెంగళూరు-చెన్నైకు రూ.1,199కు టిక్కెట్లను అందిస్తోంది. ఈ సమ్మర్ స్పెషల్ సేల్ ను మొత్తం 39 దేశీయ మార్గాలకు అందుబాటులో ఉంచింది. -
విమాన చార్జీల్లో ఎయిర్ ఏషియా 20% డిస్కౌంట్
ముంబై: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ విమాన చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌నిస్తోంది. ఈ డిస్కౌంట్ స్కీమ్ బుధవారమే ప్రారంభమైందని ఎయిర్ ఏషియా సీఈవో మిట్లు చాండిల్య చెప్పారు. ఈనెల 17 వరకూ ఈ ఆఫర్ లభ్యమవుతుందని, డిసెంబర్ 14 లోపు జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవా విమాన సర్వీసులకు ఈ నగరాల నుంచి బెంగళూరు విమాన సర్వీస్‌లకు ఈ డిస్కౌంట్ లభ్యమవుతుందని వివరించారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నై, కోచి,గోవాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 5 నుంచి బెంగళూరు నుంచి జైపూర్‌కు, బెంగళూరు నుంచి చండీగర్‌లకు విమానాలను నడపనున్న్నామని వివరించారు. ఈ విమాన సర్వీసులకు ప్రస్తుత ఆఫర్ వర్తిస్తుందని, సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 25 మధ్య ప్రయాణించాలని చాండిల్య పేర్కొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడికి విమానయానం అందించడం లక్ష్యంగా ఎయిర్ ఏషి యా ప్రారంభంలో పేర్కొన్నామని చాండిల్య గుర్తు చేశారు. ఈ లక్ష్యంలో భాగంగానే ఇప్పుడు ఈ డిస్కౌం ట్ను ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న విమాన చార్జీల్లో 35% తక్కువగానే తమ సర్వీసులనందిస్తామని ఎయిర్ ఏషియా గతంలోనే పేర్కొంది.