breaking news
Air Staff
-
ఎయిర్ స్టాఫ్ అసిస్టెంట్ చీఫ్‌గా శక్తి శర్మ
న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాల చరిత్రలో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నూతన చరిత్రను లిఖించారు. వాయుసేన ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్(విద్య)గా ఆమె బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎయిర్ వైస్ మార్షల్ లేదా ఆ హోదాకు సమానమైన పోస్ట్‌లో అధికారిణి బాధ్యతలు చేపట్టడం వాయుసేన చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. శక్తి శర్మ గతంలో వాయుసేనలో ఎయిర్ కమోండోర్గా సేవలందించారు. ‘‘భారత రక్షణ దళాల్లో ఎయిర్ మార్షల్(సమాన హోదా) స్థాయి పదవిని అధిరోహించిన తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్‌గా శక్తి శర్మ నూతనాధ్యాయానికి తెరతీశారు. భారత వాయుసేన ఘనతలో ఇదొక మైలురాయి’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో కొనయాడింది. శక్తి శర్మ 1994లో భారతవాయుసేన విద్యావిభాగంలో చేరారు. వాయుసేన శిక్షణా కేంద్రాలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్క్వార్టర్లు, ఎయిర్ హెడక్వార్డర్లలో విభిన్నమైన బాధ్యతలు ఈమె సమర్థవంతంగా నిర్వర్తించారు. వీటితోపాటు ఐఐటీ కాన్పూర్, పుణె విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చైర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపనలో కీలకభూమిక పోషించారు. కపుర్తలా సైనిక్ స్కూల్‌కు ప్రిన్సిపల్‌గా పనిచేసి త్రివిధ దళాల నుంచి ఒక సైనిక్ స్కూల్‌కు సారథ్యంవహించిన తొలి అధికారిణిగా రికార్డ్ నెలకొల్పారు. ఈమె విజయాల యాత్ర భారత రక్షణబలగాల్లో అధికారిణులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మూడు దశాబ్దాల కెరీర్లో ఈమె ఐఏఎఫ్ ‘ఘనతతో గగనాన్ని తాకండి’నినాదాన్ని నిరూపించి యువ తరానికి స్ఫూర్తిదాయకంగా మారారు’’ అని రక్షణ శాఖ శ్లాఘించింది. -
Agnipath: నిరసనకారులకు కేసుల క్లియరెన్స్ ఉండదు..జాగ్రత్త
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనేవాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది సైన్యం. ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనల్లో పాల్గొంటే.. వాళ్ల మీద గనుక పోలీస్ కేసులు నమోదు అయితే వాటికి క్లియరెన్స్ ఉండబోదని, భవిష్యత్తులో ఆర్మీలో చేరే అవకాశం ఉండదని హెచ్చరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. అగ్నిపథ్ ఆందోళనలో పాల్గొనే డిఫెన్స్ ఉద్యోగ ఔత్సాహికులు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్తతలను తాము అస్సలు ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ తరహా హింసను ఖండిస్తున్నాం. ఇది అసలు పరిష్కారం కాదు. ఆర్మీ రిక్రూట్మెంట్లో చివరి దశ.. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటారో.. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో క్లియరెన్స్ రాదు.. ఆర్మీలో చేరే తలుపులు మూసుకుపోతాయ్. గుర్తుపెట్టుకోండి’’ అని హెచ్చరించారు మార్షల్ వీఆర్ చౌదరి. అగ్నిపథ్ పథకం ఒక సానుకూల ముందడుగుగా అభివర్ణించిన ఆయన.. అభ్యర్థుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే దగ్గర్లోని మిలిటరీ స్టేషన్లకు వెళ్లి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్లకు కావాల్సింది సరైన సమాచారం తెలుసుకోవడం.. అగ్నిపథ్ గురించి కూలంకశంగా తెలుసుకోవడం. కలిసొచ్చే అంశాలను, లాభాల గురించి కూడా తెలుసుకోవాలి.. అంతేకానీ ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పారాయన. అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన ఆయన.. అవసరమైన మార్పులు చేర్పులకు అవకాశాలు లేకపోలేదని మాత్రం స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్ నియామకాలు జూన్ 24వ తేదీ నుంచి మొదలు అవుతాయని మరోసారి ప్రకటించారు ఎయిర్‌స్టాఫ్ చీఫ్. చదవండి: అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు -
విమానం కూలి 49 మంది మృతి
లావోస్‌లో దుర్ఘటన బ్యాంకాక్: లావోస్‌లో 44 మంది ప్రయాణికులు సహా ఐదుగురు వైమానిక సిబ్బంది జల సమాధి అయ్యారు. మొత్తం 49 మందితో కూడిన లావోస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క్యూవీ-301 విమానం బుధవారం రాజధాని వియంటైన్ నుంచి పక్సే పట్టణానికి బయల్దేరింది. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా అననుకూల వాతావరణం నేపథ్యంలో మెకాంగ్ నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారని లావో ప్రభుత్వం వెల్లడించింది. చనిపోయిన వారిలో 11 దేశాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొంది. విమానంలోని సగ భాగం పూర్తిగా నదిలో మునిగిపోయిందని, మృత దేహాలు చెల్లా చెదురుగా ఒడ్డున పడ్డాయని వివరించింది.


