breaking news
Air Force helicopter
-
భారత వాయుసేన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వారంలో రెండోసారి..
ఛండీగఢ్: భారత వాయుసేనకి చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో, పంజాబ్లోని పఠాన్కోట్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. పంజాబ్లోని పఠాన్కోట్ (Pathankot)లో భారత వాయుసేన అపాచీ హెలికాప్టర్-M17 అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో శుక్రవారం భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగానే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. JK: Air Force #Apache helicopter #M17 makes emergency landing in Pathankot....... pic.twitter.com/dQSNmP6NYa— Devesh , वनवासी (@Devesh81403955) June 13, 2025అయితే, వారం రోజుల వ్యవధిలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఇది రెండోసారి. జూన్ 6న, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ సమీపంలోని ఒక పొలంలో ఇలాగే వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. -
ఆ 24 మంది క్షేమం.. సీఎం కేసీఆర్ ఆనందం!
మెదక్: వరద నీటి ఉధృతిలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న 24 మందిని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సురక్షితంగా కాపాడింది. మెదక్ జిల్లా ఏడుపాయల గ్రామం సమీపంలో వరద నీటిలో మధ్యలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చింది. మంజీర నది రెండు పాయల మధ్య ఉన్న బోడెలో బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొంటున్నారు. అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పరుచుకొని పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా భారీ వర్షాలతో వరదలు చుట్టుముట్టాయి. దీంతో ప్రాణాలు అరచేత పట్టుకొని తమను కాపాడేవారి కోసం వారు ఎదురుచూస్తున్నారు. వారిని హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఐఏఎఫ్ సిబ్బంది శనివారం ప్రయత్నించినప్పటికీ వాతావరణం బాగాలేకపోవడంతో కుదరలేదు. వరద ఉధృతిలో చిక్కుకుపోయిన ఒడిశా, మధ్యప్రదేశ్ కూలీలను హెలికాప్టర్లో సురక్షితంగా తరలించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. కూలీలు చిక్కుకుపోయిన విషయంలో సీఎం కేసీఆర్ జోక్యంచేసుకోవడంతో వారిని కాపాడేందుకు ఐఏఎఫ్ రంగంలోకి దిగిందని సీఎంవో ట్విట్టర్లో తెలిపింది. ఇక, గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.