adurs
-
దేవర 2, అదుర్స్ 2 చిత్రాలపై ఎన్టీఆర్ క్లారిటీ.. ఫ్యాన్స్‌కి పండగే!
‘‘షూటింగ్‌కి వెళ్లి కెమేరా ముందు నిల్చున్న ప్రతిసారీ నాకు వణుకు వస్తుంటుంది. అలాగే మీ ముందు (ఫ్యాన్స్) మాట్లాడాలన్నా... (నవ్వుతూ). ఒక నటుడికి వినోదం పండించడం అనేది చాలా కష్టం. అందుకే నేను ‘అదుర్స్ 2’ చేయడానికి కాస్త భయపడుతున్నాను. మళ్లీ జీవితంలో అలాంటి కామెడీ మూవీ వస్తుందో లేదో’’ అని హీరో ఎన్టీఆర్(Jr NTR) అన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, ‘సత్యం’ రాజేశ్, కార్తికేయ, విష్ణు, ప్రియాంకా జవాల్కర్, రెబ్బా మోనికా జాన్ (స్పెషల్ సాంగ్) ఇతర పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘అభిమాన సోదరులకు పేరు పేరునా కృతజ్ఞతలు. చాలా కాలమైంది మనం కలుసుకుని. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా మనల్ని నవ్వించే మనిషి ఉంటే చాలు కదా అనిపిస్తుంది. ఈ రోజు దర్శకుడు కల్యాణ్ శంకర్ మనకి దొరికాడు. ‘మ్యాడ్ స్క్వేర్’తో మళ్లీ సక్సెస్ కొట్టిన కల్యాణ్‌కి అభినందనలు. ఓ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో జనాలని రంజింపచేయడం చాలా కష్టం. కానీ మీరు సాధించారు. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. ఈ మూవీలో మురళీధర్గారు అద్భుతంగా నటించారు. లడ్డు పాత్ర చేసిన విష్ణు లేకుంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కాదేమో? అనిపించింది. డైరెక్టర్ శోభన్‌గారి అబ్బాయిలు సంతోష్, సంగీత్‌లను చూస్తే ఆయన గుర్తొస్తారు. మనకి బాగా ఇష్టమైన వాళ్లు మనకి దూరమైనా మన చుట్టూనే ఉంటారు. మీ నాన్నగారు కూడా గర్వపడుతుంటారు. ‘మ్యాడ్’లో రామ్ నితిన్‌ని చూస్తే నేను యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నారు. నాకు 2011లో పెళ్లయింది. నార్నే నితిన్ అప్పుడు చాలా చిన్నపిల్లాడు. నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ, ధైర్యం చేసి నా వద్దకు వచ్చి నాతో చెప్పిన ఒకే ఒక్క మాట ‘బావా... నేను యాక్టర్ అవుతాను’ అని.. అంతే ధైర్యంగా నేను ‘నా సపోర్ట్ నీకు ఉండదు... పోయి చావ్ అన్నాను’. కానీ, ఇండస్ట్రీలో తన కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే భయం ఉండేది. నీకు నువ్వుగా ముందుకెళ్లు అన్నాను. తనే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాడు. ఈ రోజు తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సునీల్ లేకపోతే ‘మ్యాడ్ స్క్వేర్’ లేదు. సంగీత దర్శకుడు భీమ్స్, రచయిత కాసర్ల శ్యామ్‌తో పాటు ఈ సినిమాకి పని చేసిన అందరికీ అభినందనలు. వీళ్లందరి వెనకాల కనపడని ఓ శక్తే మా చినబాబు. త్వరలోనే మేం ఓ సినిమా చేయబోతున్నాం. ఇక ‘దేవర’ చిత్రాన్ని ఆదరించినందుకు, మీ (ఫ్యాన్స్) భుజాలపైన మోసినందుకు ధన్యవాదాలు. ‘దేవర 2’ (Devara 2) కచ్చితంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో ప్రశాంత్ నీల్గారు వచ్చారు. నేను ఫ్యాన్స్ కోసమే కష్టపడుతుంటాను. మిమ్మల్ని ఆనందపరచడానికే బతికుంటాను. మీరెప్పుడూ కాలర్ ఎత్తుకునేలాగే ప్రయత్నిస్తాను.. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు.. కానీ మీకోసం కష్టపడుతూనే ఉంటాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. నేను వచ్చినప్పటి నుంచి ‘జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్’ అనే స్లోగన్స్ చూస్తుంటే... జేఏఐఎన్టి... జెయింట్ గుర్తొస్తోంది. సో.. ఎన్టీఆర్ జెయింట్’’ అన్నారు. ఈ వేడుకలో ‘మ్యాడ్ స్క్వేర్’ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులకు షీల్డ్‌లు ప్రదానం చేశారు. -
ఆ పాత్రను ఎన్టీఆర్ తప్ప ఇండియాలో మరొకరు చేయలేరు: కోన వెంకట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్‌ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా స్వీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్‌తో అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్ అదుర్స్ 2 అప్డేట్ ఇచ్చాడు. ‘అదుర్స్ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్ అన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ భారీ హిట్స్.. అయితే, ఇక్కడో సెంటిమెట్
చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అంటూ అల్లాడిపోతాం. కానీ హీరోలు ఏకంగా కత్తిపోటుకు గురైనా అదరరు, బెదరరు. యాక్షన్ సీన్లలో దెబ్బలు తాకినా, రక్తాలు కారుతున్నా ముందుగా సీన్ కంప్లీట్ చేయడానికే శ్రద్ధ చూపుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెట్స్‌లో ఇలా గాయాల బారిన పడటం పరిపాటి. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడు. అయితే ఆయన తాతగారు నందమూరి తారక రామారావు ఆశీస్సుల వల్లో, లేక అభిమానుల ప్రేమాభిమానాల వల్లో కానీ ఎటువంటి ప్రాణహాని లేకుండా స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. మరి తారక్ ఏయే సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడో చూసేద్దాం... స్టూడెంట్ నెంబర్ 1: రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే ఎన్టీఆర్ వెండితెరపై హీరోగా పరిచయమవ్వాల్సి ఉంది. కానీ ఓ షెడ్యూల్లో తారక్ గాయపడటంతో చిత్రీకరణ కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ ఎన్టీఆర్‌కు ఫస్ట్ బాక్సాఫీస్ హిట్‌ను అందించింది ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రమే. ‘ఆది’ సినిమా టైంలోనూ తారక్ దెబ్బలు తగిలించుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అందులోని ఓ ముఖ్యమైన ఫైట్ సీన్లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే చేతికి కట్టు ఉండగానే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ అనే సాంగ్ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఈ పాటతో పాటు సినిమా కూడా ఓ రేంజ్లో హిట్టైన విషయం తెలిసిందే. సింహాద్రి.. సినిమాతో మరింత పాపులర్ అయిన ఎన్టీఆర్‌కు ఈ మూవీ షూటింగ్‌లోనూ ఇంజూర్ అయింది. అయినప్పటికీ తన గాయాలను లెక్క చేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆయన కష్టానికి ఫలితంగా సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తర్వాత ‘యమదొంగ’, ‘బృందావనం’ చిత్రీకరణ సమయంలోనూ తారక్‌కు దెబ్బలు తాకాయి, కానీ ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ‘శక్తి’ సినిమాలో కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు చిత్రీకరించిన సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఇక్కడ విడ్డూరమేంటంటే అంత కష్టపడి చేసిన సీన్లను ఎడిటింగ్‌లో లేపేయడమేకాక, ఇది అతడి కెరీర్లోనే డిజాస్టర్‌గా నిలిచింది. ‘సాంబ, ఊసరవెల్లి’.. సినిమాల షూటింగ్ సమయంలోనూ తారక్ గాయపడగా, ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ‘అదుర్స్’ సినిమా షూటింగ్ ముగించుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనూ ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయింది. గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు తారక్. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైంలోనూ తారక్ గాయపడ్డ విషయం తెలిసిందే! -
ఏరియల్ షో అదుర్స్
-
షో అదుర్స్
బైక్ కంపెనీ ఉత్పత్తుల ప్రమోషన్ వర్క్‌లో భాగంగా ఓ ప్రైవేట్ సంస్థ జిల్లా కేంద్రం అనంతపురంలో శనివారం నిర్వహించిన స్టంట్ షో యువతను ఆకట్టుకుంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బైక్ స్టంట్ చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువకులు అందరూ చూస్తుండగా పలు విన్యాసాలు చేశారు. అదే సమయంలో అప్రమత్తంగా లేకపోతే జరిగే అనర్థాలను కూడా షోలో భాగంగా కిందపడి చూపారు. యువకుల సాహస విన్యాసాలను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. - సాక్షి పొటోగ్రాఫర్, అనంతపురం