జూనియర్‌ ఎన్టీఆర్‌ భారీ హిట్స్‌.. అయితే, ఇక్కడో సెంటిమెట్‌

Jr NTR Injured During Shooting Movies List Here - Sakshi

చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అంటూ అల్లాడిపోతాం. కానీ హీరోలు ఏకంగా కత్తిపోటుకు గురైనా అదరరు, బెదరరు. యాక్షన్‌ సీన్లలో దెబ్బలు తాకినా, రక్తాలు కారుతున్నా ముందుగా సీన్‌ కంప్లీట్‌ చేయడానికే శ్రద్ధ చూపుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెట్స్‌లో ఇలా గాయాల బారిన పడటం పరిపాటి. ఈ క్రమంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా కొన్ని సినిమాల షూటింగ్‌ సమయంలో గాయాలపాలయ్యాడు. అయితే ఆయన తాతగారు నందమూరి తారక రామారావు ఆశీస్సుల వల్లో, లేక అభిమానుల ప్రేమాభిమానాల వల్లో కానీ ఎటువంటి ప్రాణహాని లేకుండా స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. మరి తారక్‌ ఏయే సినిమాల షూటింగ్‌ సమయంలో గాయాలపాలయ్యాడో చూసేద్దాం...

స్టూడెంట్‌ నెంబర్‌ 1: రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ వెండితెరపై హీరోగా పరిచయమవ్వాల్సి ఉంది. కానీ ఓ షెడ్యూల్‌లో తారక్‌ గాయపడటంతో చిత్రీకరణ కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ ఎన్టీఆర్‌కు ఫస్ట్‌ బాక్సాఫీస్‌ హిట్‌ను అందించింది ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ చిత్రమే. ‘ఆది’ సినిమా టైంలోనూ తారక్‌ దెబ్బలు తగిలించుకున్నాడు. వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అందులోని ఓ ముఖ్యమైన ఫైట్‌ సీన్‌లో ఎన్టీఆర్‌ గాయపడ్డాడు. అయితే చేతికి కట్టు ఉండగానే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ అనే సాంగ్‌ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఈ పాటతో పాటు సినిమా కూడా ఓ రేంజ్‌లో హిట్టైన విషయం తెలిసిందే.

సింహాద్రి.. సినిమాతో మరింత పాపులర్‌ అయిన ఎన్టీఆర్‌కు ఈ మూవీ షూటింగ్‌లోనూ ఇంజూర్‌ అయింది. అయినప్పటికీ తన గాయాలను లెక్క చేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆయన కష్టానికి ఫలితంగా సింహాద్రి ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. తర్వాత ‘యమదొంగ’, ‘బృందావనం’ చిత్రీకరణ సమయంలోనూ తారక్‌కు దెబ్బలు తాకాయి, కానీ ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ‘శక్తి’ సినిమాలో కొన్ని అనవసరపు యాక్షన్‌ సీన్లు చిత్రీకరించిన సమయంలో ఎన్టీఆర్‌ గాయపడ్డాడు. ఇక్కడ విడ్డూరమేంటంటే అంత కష్టపడి చేసిన సీన్లను ఎడిటింగ్‌లో లేపేయడమేకాక, ఇది అతడి కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది.

‘సాంబ, ఊసరవెల్లి’.. సినిమాల షూటింగ్‌ సమయంలోనూ తారక్‌ గాయపడగా, ఈ రెండు సినిమాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ‘అదుర్స్‌’ సినిమా షూటింగ్‌ ముగించుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనూ ఎన్టీఆర్‌ కారుకు యాక్సిడెంట్‌ అయింది. గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు తారక్‌. ఇక ఈ సినిమా కూడా సూపర్‌ హిట్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ టైంలోనూ తారక్‌ గాయపడ్డ విషయం తెలిసిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top