Adhitya birla
-
ఆర్సీబీ టీమ్ పేరు మార్పు?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్య మార్పు చోటు చేసుకున్న సంగతి తెలిసింది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,725 కోట్లు) కొనుగోలు చేసింది.ఈ డీల్‌తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అయితే యాజమాన్యం మారడంతో ఆర్సీబీ జట్టు పేరు కూడా మారనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయంపై ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కీలక సభ్యురాలైన అనన్య బిర్లా క్లారిటీ ఇచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆమె స్పష్టం చేశారు.కాగా 2008 నుంచి ఐపీఎల్లో ఉన్న అంత్యంత పాపులర్ ఫ్రాంచైజీలలో ఆర్సీబీ ఒకటి. గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన తర్వాత ఆర్సీబీకి ఉన్న క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. కాబట్టి పేరు మార్చి ఆర్సీబీ బ్రాండ్ వాల్యూను దెబ్బ తీయకూడదని కొత్త యాజమాన్యం కూడా భావిస్తోంది. ఈ చారిత్రత్మక డీల్‌లో ఆర్సీబీ పురుషల జట్టుతో పాటు డబ్ల్యూపీఎల్ జట్టు కూడా ఉంది. కాగా ఆదిత్య బిర్లా, డేవిడ్ బ్లెజర్, బ్లాక్‌స్టోన్ కన్సార్షియం ఆర్సీబీని మార్చి 31లోపు టేకోవర్ చేసుకోనుంది. అయితే, ఈ డీల్‌కు బీసీసీఐ, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ పాలకమండల నుంచి ఇంకా అధికారిక అనుమతులు లభించాల్సి ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.చదవండి: దినేష్ కార్తీక్‌కు అరుదైన గౌరవం -
భాగ్ పాండే భాగ్
విధివంచితుణ్ని అనుకుంటూ బాధపడుతూ కూర్చోలేదు.. మనీష్ పాండే. అంతులేని ఆత్మవిశ్వాసంతో పరుగు పోటీల్లో రాణిస్తున్నాడు. విశేషాలు అతని మాటల్లోనే... నా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్. అక్కడే పుట్టి పెరిగాను. చదువుకున్నదీ అక్కడే. వూ నాన్న జేఎస్ పాండే ఆదిత్య బిర్లా ఉద్యోగి. అవ్ము ఊర్మిళ పాండే గృహిణి. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేశా. కళాశాల స్థాయికి వచ్చేసరికి వివిధ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించాను. చివరకు నేషనల్ లాంగ్ జంపర్‌గా ఎదిగా. అయితే 2011 ఏప్రిల్ 2న ఊహించని ప్రమాదం ఎదురైంది. తోపులాటలో కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయూను. కుడి కాలు చచ్చుబడింది. లక్ష్యం వూర్చుకున్నా.. కాస్త కోలుకున్న తర్వాత లక్ష్యాన్ని వూర్చుకున్నా. 2012లో బెంగళూరులో జరిగిన పారా ఒలింపిక్స్ ట్రయల్ రన్లో 100 మీటర్లు, 200 మీటర్లలో పరుగెత్తా. అక్కడ నా ప్రతిభను గుర్తించిన ఓ వ్యక్తి బ్లేడ్ ప్రొటెస్టిక్ వాడితే పారా ఒలింపిక్స్‌లో రాణించొచ్చన్నాడు. రూ. 4 లక్షల విలువచేసే ఆ బ్లేడ్ కొనుగోలు చేసే స్తోవుత లేక నిరాశకు గురయ్యాను. ఆదుకున్న హైదరాబాద్.. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని దక్షిణ రిహాబిలిటేషన్ సెంటర్ డెరైక్టర్ మోహన్ గాంధీ బ్లేడ్‌తో పాటు ఈవెంట్లో పాల్గొనేందుకు పూర్తి ఖర్చును భరిస్తానని హామీనిచ్చారు. అంతే.. ఇక ఆగలేదు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీసు చేయుడం మొదలెట్టా. సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటూ పూర్తిగా పారా ఒలింపిక్స్‌పైనే దృష్టి కేంద్రీకరించా. కోచ్ లేకున్నా యూ ట్యూబ్ ద్వారా ప్రముఖ అథ్లెట్లు హుస్సేన్ బోల్ట్, జానీ పికాక్ ప్రాక్టీస్ తీరును చూసేయుడం.. నా శైలిలో సాధన చేయుడడం అలవాటు చేసుకున్నా. గత నెలలో ట్యునీషియాలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ పిక్స్‌లో ఏపీ తరఫున బ్లేడ్ రన్నర్‌గా పాల్గొన్నా. 100 మీటర్ల విభాగంలో 0.2 సెకన్ల తేడాతో బంగారు పతకం చేజారింది. కాంస్యంతో సరిపెట్టుకున్నా. 200 మీటర్ల విభాగంలో రజతం సాధించా. వీటితో పాటు ఆసియా పారా ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాను. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం. అయితే ప్రభుత్వం తరఫున సహాయం లభిస్తే మరింత రాణించేందుకు అవకాశముంటుంది. - వాంకె శ్రీనివాస్


