ఆర్సీబీ టీమ్ పేరు మార్పు? | RCBs Name To Be Changed After Rs 16,700 Crore Sale? | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ టీమ్ పేరు మార్పు?

Mar 26 2026 8:47 AM | Updated on Mar 26 2026 9:20 AM

RCBs Name To Be Changed After Rs 16,700 Crore Sale?

ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్య మార్పు చోటు చేసుకున్న సంగతి తెలిసింది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,725 కోట్లు) కొనుగోలు చేసింది.

ఈ డీల్‌తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అయితే యాజమాన్యం మారడంతో ఆర్సీబీ జట్టు పేరు కూడా మారనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయంపై ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కీలక సభ్యురాలైన అనన్య బిర్లా క్లారిటీ ఇచ్చారు.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆమె స్పష్టం చేశారు.

కాగా 2008 నుంచి ఐపీఎల్‌లో ఉన్న అంత్యంత పాపులర్ ఫ్రాంచైజీలలో ఆర్సీబీ ఒకటి. గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన తర్వాత ఆర్సీబీకి ఉన్న క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. కాబట్టి పేరు మార్చి ఆర్సీబీ బ్రాండ్ వాల్యూను దెబ్బ తీయకూడదని కొత్త యాజమాన్యం కూడా భావిస్తోంది. 

ఈ చారిత్రత్మక డీల్‌లో ఆర్సీబీ పురుషల జట్టుతో పాటు డబ్ల్యూపీఎల్ జట్టు కూడా ఉంది. కాగా ఆదిత్య బిర్లా, డేవిడ్ బ్లెజర్, బ్లాక్‌స్టోన్ కన్సార్షియం ఆర్సీబీని మార్చి 31లోపు టేకోవర్ చేసుకోనుంది. అయితే, ఈ డీల్‌కు బీసీసీఐ, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ పాలకమండల నుంచి ఇంకా అధికారిక అనుమతులు లభించాల్సి ఉంది. 

ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: దినేష్‌ కార్తీక్‌కు అరుదైన గౌరవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement