దినేష్‌ కార్తీక్‌కు అరుదైన గౌరవం | Fans adore Dinesh Karthik in record-breaking event | Sakshi
Sakshi News home page

దినేష్‌ కార్తీక్‌కు అరుదైన గౌరవం

Mar 26 2026 8:18 AM | Updated on Mar 26 2026 9:53 AM

Fans adore Dinesh Karthik in record-breaking event

భారత మాజీ క్రికెటర్, తమిళనాడుకు చెందిన దినేశ్‌ కార్తీక్‌పై తమకున్న అభిమానాన్ని చెన్నైస్‌ అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో చెన్నైస్‌ అమృత విద్యాసంస్థల వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కార్తీక్‌ జెర్సీ నంబర్‌ 19 ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమృత విద్యాసంస్థలకు చెందిన సుమారు మూడు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా కలిసి ‘సీఏ♡డీకే19’ ఆకారంలో మానవహారాన్ని ఏర్పాటు చేసి అబ్బురపరిచారు.

‘ఒక క్రీడాకారుడి జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో అత్యధిక మంది విద్యార్థులు పాల్గొన్న రికార్డుగా ఈ వినూత్న కార్యక్రమానికి ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’... ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లలో చోటు లభించింది. చెన్నైస్‌ అమృత గ్రూప్‌ చైర్మన్‌ ఆర్‌.భూమినాథన్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్, గౌరవ అతిథిగా తమిళనాడు డాక్టర్‌ ఎం.జి.ఆర్‌ మెడికల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కె.నారాయణ స్వామి పాల్గొన్నారు.
చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?

Advertisement
 
Advertisement
Advertisement