breaking news
Additional burden on the
-
సామాన్యుడిపై మరో భారం
- పెట్రోల్‌పై రూ.1.69 పెంపు. - డీజిల్‌పై 50 పైసల బాదుడు - జిల్లా ప్రజలపై ఏటా రూ.36.34 కోట్ల భారం - నిత్యావసరాలపై చూపనున్న ప్రభావం సాక్షి, అనంతపురం/ అనంతపురం కలెక్టరేట్ : రైలు చార్జీల తర్వాత పెట్రో ధర పెంపుతో సామాన్యులపై మరో భారం పడింది. లీటరు పెట్రోలుపై రూ.1.69, డీజిలుపై 50 పైసలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.77.57 ఉండగా పెరిగిన ధరతో రూ.79.26 కు చేరుకుంది. ఇక లీటరు డీజిల్ రూ.62.37 నుంచి రూ.62.87కు చేరుకుంది. పెట్రో ధరల పెంపు కారణంగా జిల్లా ప్రజలపై ఏటా రూ.36.34కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన రైలు చార్జీలతో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావం పరోక్షంగా నిత్యవసరాలపై చూపనుంది. పెట్రో ధరల పెంపుపై సామాన్యులు భగ్గుమన్నారు. జిల్లాలో 225 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు 2.50 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. లీటరు పెట్రోల్‌పై రూ.1.69 పైసలు పెరగడంతో రోజుకు రూ.4,22,500, నెలకు రూ.1,26,75,000, ఏడాదికి రూ.15.21 కోట్లు ప్రజలపై అదనపు భారం పడనుంది. ఇక జిల్లాలో రోజుకు 10.64లక్షల డీజిల్ వినియోగం జరుగుతోంది. ఈ మేరకు లీటరుపై 50 పైసలు పెరగడంతో రోజుకు రూ.5.32 లక్షలు భారం పడనుండగా నెలకు రూ.1,59,60,000, ఏడాదికి రూ.19.15 కోట్ల భారం పడనుంది. . -
మళ్లీ పెట్రోభారం
- పెట్రోలుపై రూ.1.69 , డీజిల్‌పై 50పైసలు - అర్ధరాత్రి నుంచి అమలులోకి.. నెల్లూరు (సెంట్రల్): నరేంద్రమోడీ సర్కారు ఏర్పాటైన నెలకే ప్రజలపై రెండోసారి పెట్రోధరల భారం మోపింది. పెట్రోలుపై రూ.1.69, డీజిల్‌పై రూ.50 పైసలు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. పన్నులతో కలిపి పెట్రోలు ధర రూ.2, డీజిల్ ధర 62 పైసలు పెరిగింది. ఈ క్రమంలో పెట్రోలు ధర రూ.79.91, డీజిల్ రూ.63.24కి చేరింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరల కారణంగా జిల్లా వాసులపై నెలకు రూ.3.29 కోట్ల అదనపు భారం పడనుంది.