breaking news
acqua
-
ఆక్వాలో కొత్త అధ్యాయం : చందువా పార
తీర ప్రాంతంలోని ఆక్వా రైతులు ఉప్పునీటిలో పెంచదగిన జలపుష్పాల జాబితా చాలా తక్కువ. ఒకటి, రెండు రకాల ఉప్పునీటి రొయ్యలే అధికంగా సాగు చేస్తారు. వీటికి జబ్బులు సోకినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉప్పునీటిలో సాగు చేయటానికి పండుగప్ప తర్వాత అంతకన్నా ఖరీదైన Indian Pompano ఇండియన్ పాంపనొ (చందువా పార) చేప ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది వేగంగా పెరుగుతుంది. రుచిగా ఉంటుంది. సాగులో రొయ్యలు, పంచుగప్ప చేపతో పోల్చితే రైతులకు రిస్క్ చాలా తక్కువ. మరణాల శాతం తక్కువ. అయితే, దీని హేచరీ అందుబాటులో లేక΄ోవటం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ కొరత తీరింది. విశాఖపట్నంలోని భారతీయ సముద్ర చేపల పరిశోధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రాంతీయ కార్యాలయ శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. సముద్రంలో పెరిగే చందువా జాతి చేపలను కోస్తాప్రాంతంలో ఉప్పునీటి చెరువుల్లో పెంచడానికి అవసరమైన కాప్టివ్ బ్రీడింగ్, సీడ్ ప్రొడక్షన్ వంటి సాంకేతికతలన్నీటినీ సిఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చెరువుల్లోనే కాదు సముద్రతీరంలోని తక్కువ లోతులో నీటిపై తేలాడే పంజరాలను ఏర్పాటు చేసి చందువా పార చేపలను సాగు చేసే మారికల్చర్ టెక్నాలజీని కూడా సీఎంఎఫ్ఆర్ఐ రూపొందించింది. విశాఖ కార్యాలయంలో ఏర్పాటైన మారికల్చర్ ప్రయోగశాలలో చందువా పారతో పాటు బొంతలు (గ్రూపర్స్), అప్పాలు చేప (జాన్స్ స్నాపర్) వంటి జాతులపై కూడా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. కోస్తా ప్రాంత ఆక్వా రైతులు వైరస్ తదితర జబ్బులు, తుపాన్లు, ఎగుమతి మార్కెట్లలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎగుమతి మార్కెట్ కోసం పెంచే రొయ్యలతోపాటు.. స్థానిక ప్రీమియం మార్కెట్ల కోసం పంట మార్పిడిగా పెంచే అధిక ధర గల చందువాపార వంటి చేపల సాగు సాంకేతికతలు అందుబాటులోకి రావటం ఆక్వా రైతులకు నిజంగా శుభవార్త. సీఎంఎఫ్ఆర్ఐ రూపొందించిన ‘చందువా పార’ చేపల సాగు పద్ధతులను సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం....చందువాపార ఆక్వాకల్చర్ రంగంలో వచ్చే కొద్ది ఏళ్లలో కొత్త అధ్యాయాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఆర్థిక తోడ్పాటుతో బ్లూరెవెల్యూషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనేక కోస్తా ప్రాంత చెరువుల్లో చందువాపార చేపలను సీఎంఎఫ్ఆర్ఐ ప్రోత్సహించి సాగు చేయించింది. సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్తలు శేఖర్ మేగరాజన్, రితేష్ రంజన్, బిజి జేవియర్, శుభదీప్ ఘోష్, పొన్నగంటి శివ, నరసింహులు సిద్ధు, ఆర్.పి. వెంకటేష్, ఇమెల్డా జోసెఫ్‌లు సంయుక్తంగా అందించిన వివరాల ప్రకారం చందువాపార సాగులో అనేక దశల్లో చేపట్టాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల విశేషాలు ఇలా ఉన్నాయి.చెరువును సిద్ధం చేయటం...చెరువు అంతటినీ 1.5 మీటర్ల లోతున సమతలంగా ఉండేలా రూపొందించాలి.పాత చెరువుల్లో ఈ చేపలను పెంచుతూ ఉంటే, చెరువు అడుగున పేరుకున్న వ్యర్థాలను తొలగించి, దుక్కి చెయ్యాలి. చందువాపార చేపల సాగుకు నీటి ఉదజని సూచిక (పిహెచ్) సగటున 7.5–8.5 మధ్యన ఉండాలి. మట్టి పిహెచ్ ఎంత ఉందన్న దాన్ని బట్టి చెరువును సిద్ధం చేసేటప్పుడు ఎంత సున్నం చల్లాలో ఆధారపడి ఉంటుంది.నీటి యాజమాన్యం...చెరువును సిద్ధం చేసిన తరువాత కాలువ నీటిని లేదా రిజర్వాయర్ నీటిని నేరుగా చెరువులోకి నింపవచ్చు. నీటిని నింపేముందు 100 మైక్రోమీటర్ల కన్నా తక్కువగా ఉండే ఫిల్టర్ బ్యాగ్‌లను విధిగా ఉపయోగించాలి. చెరువు నీటిలోకి అవాంఛనీయ చేపల పిల్లలు రాకుండా ఉండేందుకు ఈ ఫిల్టర్లు అవసరం. 10 పిపిఎం క్లోరినేషన్ ద్వారా చెరువును శుద్ధి చెయ్యాలి. నాలుగురోజుల తర్వాత క్లోరినేషన్ నీటిలో యూరియా (2.5 పిపిఎం), ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ (టిఎస్పి) (3పిపిఎం) వాడి చెరువు నీటి నాణ్యతను సరిచేయాలి. చెరువులో సేంద్రియ లేదా రసాయనిక ఎరువులు వేసుకోవటం ద్వారా ప్లవకాల (ప్లాంక్టన్)ను వృద్ధి చెయ్యాలి. ప్లాంక్టన్ చెరువు నీటిలో పెరిగితేనే నీటి నాణ్యత సరిగ్గా ఉంటుంది. చందువా పార చేలు 5 నుంచి 40 పిపిటి వరకు ఉప్పు నీటిని తట్టుకోగలవు. అయితే, 15–35 పిపిటి మధ్యలో నీటి ఉప్పదనం ఉంటే మంచి అనుకూల వాతావరణం ఉంటుంది.చేపపిల్లల రవాణా...అత్యంత శ్రద్ధతో చేపపిల్లల రవాణా చెయ్యాలి. ఈ క్రమంలో ఒత్తిడి కలిగితే చేప పిల్లలకు సూక్ష్మ క్రిములు సోకడమే కాకుండా అవి చని΄ోయే పరిస్థితి కూడా వస్తుంది. ఆక్సిజన్ సరఫరా ఉండేలా సెంటెక్స్ ట్యాంకుల్లో గానీ పాలిథిన్ బ్యాగుల్లో గానీ తీసుకెళ్లాలి. చేపపిల్లల సైజు, ప్రయాణ వ్యవధి, చేపపిల్లల సంఖ్య, రవాణా పద్ధతిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. నర్సరీ పెంపకం : నర్సరీ పెంపకంలో ఒక మీటరుకి 200 నుండి 280 పిల్ల చేపలు తగినంత స్టాకింగ్ డెన్సిటీగా చెప్పవచ్చు. చేపలు కృత్రిమ మేతకు అలవాటుపడతాయి. అయితే మేతలో మంచి పోషక విలువలు ఉండాలి. మొదటి దశలో ప్రోటీన్ 45%, కొవ్వు శాతం 111% చొప్పున శరీర బరువులో 10%, రోజుకు 4 – 5 సార్లు మేత ఇవ్వాలి. 2–3 గ్రాములు పెరిగిన పిల్లచేపలను 30–40 గ్రాములు వచ్చే వరకు 60 నుంచి 75 రోజుల పాటు పెంచాలి. ఆ తర్వాత పెంపకపు చెరువు (గ్రో–అవుట్ చెరువు) ల్లోకి మార్చాలి. ఆక్సిజన్ స్థాయిలు 4 పిపిఎం కన్నా ఎక్కువ ఉండేలా నిర్వహిస్తే∙90–95% చేపలు పెరిగి పెద్దవుతాయి.ఎకరానికి 5 వేలు : నర్సరీలో పెంచిన చేప పిల్లలను ఎకరాకు 5000 చొప్పున పెద్ద చెరువుల్లోకి వదలాలి. ఎయిరేటర్లను చెరువు నాలుగు దిక్కులా అమర్చాలి. క్రమం తప్పకుండా ఎరువులు చల్లుతూ నీటి నాణ్యత చూసుకుంటూ ఉండాలి. అధిక ప్రోటీన్‌తో కూడిన నీటిపై తేలాడే (40% ప్రోటీన్ – 10% కొవ్వు పదార్ధాలు) ఆహార గుళికలను చేప పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. మేత ఇస్తున్నప్పుడు గాలివాటానికి అనుగుణంగా, మేత వృథా కాకుండా పంజరపు లోపలి వలలో ఫీడ్ మెష్ ను (1 మీటర్లు లోతు) ఏర్పాటు చెయ్యాలి. తొందరగా జీర్ణం కావడం కోసం, ప్రతి 3 గంటలకొకసారి దాణా ఇవ్వాలి. ప్రతి పదిహేను రోజులకొకసారి చేపల బరువు తూచి, వాటి ఎదుగుదల ఆధారంగా దాణాను లెక్కవేసుకోవాలి. 10 నుంచి 20 గ్రాములు ఉన్న చేప పిల్లలని క్యూబిక్ మీటరుకు 1 నుంచి∙1.25 చొప్పున చెరువులో వదిలినప్పుడు.. 5–6 నెలల్లో 500–600 గ్రాములకు, 12 నెలల వ్యవధిలో కిలో బరువుకు పెరుగుతాయని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే, 100 గ్రాము సైజులో ఉన్నప్పుడు చెరువులో వేస్తే కేవలం 7 నెలల్లోనే కిలో సైజుకు పెరుగుతాయి. చెరువు అడుగు భాగంలో ఉండే చెత్తని, బురదని ఎప్పటికప్పుడు తీసివేసి, శుభ్రపరుస్తుంటే విష వాయువుల ప్రభావం తక్కువగా ఉండి నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.6 రాష్ట్రాల్లో మార్కెట్లు అనువైనవి : మార్కెట్ సైజుకు పెరిగిన చందువ పార చేపలను డ్రాగ్ నెట్ వల సహాయంతో అత్యంత సులువుగా పట్టుకుని వెలికితీయవచ్చు. బయటికి తీసిన చేపలను మొత్తాన్ని వెంటనే పరిశుభ్రమైన నీటిలో కడిగి, ఐస్ ముక్కల్లో పెట్టి, తాజాగా, నాణ్యత ΄ోకుండా చూడాలి. ప్లాస్టిక్ ట్రేలలో గానీ లేదా థర్మోకోల్ పెట్టెల్లో గాని పెట్టి, ఐస్ ముక్కలు చల్లి ప్యాక్ చేస్తారు. పెద్దమొత్తంలో సాగు చేయడమే కాకుండా, స్థానిక మార్కెట్లో గిరాకీని బట్టి బ్యాచ్ పధ్ధతిలో కూడా హార్వెస్ట్ చేయవచ్చు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లు చందువా పార చేపలను విక్రయించడానికి అత్యంత అనువైనవి. ఒక ఎకరాకు 5000 పిల్లలు వేస్తే కేజీకి రూ. 325 చొప్పున (ఇది పాత ధర) రైతుకు సుమారు రూ. 2.25 లక్షలు నికర లాభం వస్తుందని అంచనా.silver pompano fingerlingsచందువా పార చేపల విశేషాలు...శాస్త్రీయ నామం: ట్రాచినోటస్ మూకలీ. కుటుంబం: కారంగిడే (జాక్స్, పాంపానోస్). పరిమాణం: 10 గ్రాములు లేదా 2 అంగుళాల పిల్లలను చెరువుల్లో వేసుకుంటే 5–6 నెలల్లో అర కిలోకి పైగా సైజుకు పెరుగుతుంది. స్వరూపం: బాగా ఎదిగిన చేపలు బంగారు నారింజ రంగులో మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర. ఆవాసం: తీర్ర ప్రాంత సముద్ర జలాలు, నదీ ముఖ ద్వారాలలో కనిపిస్తాయి. ఆహారం: తిండిపోతు. మాంసాహారి. అయితే, పండుగప్ప చేపల మాదిరిగా తమ జాతి చిన్న చేపలను పెద్ద చేపలు తినవు.ఆక్వాకల్చర్‌కు అనుకూలతలు: మెరుగైన మాంసం నాణ్యత, అధిక మార్కెట్ డిమాండ్ కారణంగా సముద్ర జలాల్లోని పంజరాల్లో, కోస్తా ప్రాంత ఉప్పునీటి చెరువుల్లో సాగుకు.. ఈ రెండింటికీ అనువైనది. వ్యాధి నిరోధకత: చాలా రకాల వ్యాధులను తట్టుకోగల నిరోధక శక్తి ఉండటం దీనికి గల మరో ప్రత్యేకత. కేజ్ కల్చర్: తీరప్రాంత సముద్ర జలాల్లో కేజ్ కల్చర్ ద్వారా విజయవంతంగా సాగవుతోంది, వాణిజ్య స్థాయిలో పెంచటానికి అనువైనది. సంతానోత్పత్తి: చందువా పార చేపలు ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల్లో సంతానోత్పత్తి చేస్తాయి. విత్తనోత్పత్తి: సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు భారతీయ పాంపనో చేపల సంతానాభిద్ధి, లార్వా పెంపకం, నర్సరీ పెంపకం కోసం సాంకేతికతను అభివృద్ధి చేశారు. మార్కెట్ డిమాండ్: అధిక మార్కెట్ డిమాండ్ ఉంది. మంచి దేశీయ ధర పలుకుతోంది. రైతు నుంచి కిలో రూ. 35–450 వరకు పలుకుతోంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన ఆక్వాకల్చర్ చేపల జాతిగా గుర్తింపు వచ్చింది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు: చందువా పార చేపల్లో ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెకు చాలా ఆరోగ్యకరమైనవి. అందువల్ల హెల్దీ ఫ్యాట్ వనరుగా నిపుణులు చెబుతున్నారు. చెరువలో నీటి నాణ్యత, రంగులను మెరుగ్గా ఉంచుకోవాలంటే ప్రతి 15 రోజులకోసారి ఎరువులు వేసుకోవాలి. కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి.30 గ్రాముల కన్నా పెరిగిన సైజు పిల్లలను పెంపకపు చెరువులో వేసుకుంటే ఎక్కువ శాతం బతుకుతాయి. చెరువులో ఫీడింగ్ జోన్‌ను ఏర్పాటు చేసుకొని మేత వేస్తూ ఉంటే మేత వృథాని అరికట్టవచ్చు. నీటి నాణ్యత బాగుండాలంటే చెరువులోని నీటి పరిమాణంలో 25% నీటిని ప్రతి నెలా మార్చాలి. ఈ పని చేస్తే ప్రొబయోటిక్స్, వాటర్ కండిషనర్ మందులు వాడకుండా నివారించుకోవచ్చు.చెరువులో రోజుకు కనీసం 10 గంటల సేపు ఎకరానికి 2–3 పెడల్ వీల్ ఎయిరేటర్లను ఉపయోగించాలి. మంచి ఆదాయం రావాలంటే ఎకరానికి 5 వేల పిల్లలను వేసుకోవటం ఉత్తమం. -
న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్‌కి వెళదామని ట్రాక్ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్‌కి ఫిదా అవుతోంది నగర యువత. – సాక్షి, సిటీబ్యూరోపింగ్ జాక్‌లు, ఆర్మ్ లిఫ్ట్‌లు, లెగ్ కిక్స్, లెగ్ షూట్స్ ఇవన్నీ.. రోజూ జిమ్‌లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్లు/హైడ్రో ఎక్సర్సైజ్లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్‌లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్‌లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్ ఇన్స్ట్రక్టర్ కవితారెడ్డి. చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీవ్యాయామాలెన్నో.. ఆక్వా ఎరోబిక్స్ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్–బాక్సింగ్ వంటి అనేక రకాలైన వర్కవుట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్ గ్లోవ్స్, రెసిస్టెన్స్ ట్యూబింగ్, వాటర్ వాకింగ్, ఆక్వా థ్రెడ్మిల్స్, వాటర్ బైక్‌లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలెన్నో.. నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్‌టెన్సివ్‌గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్లోడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్‌లాస్ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్ పాస్ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్‌లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది. చదవండి : వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!కొన్ని సూచనలు మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం స్విమ్మింగ్ క్యాప్ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్ ధరించాలి.నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి. శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు. నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్ ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అనుభవం లేకుంటే డైవింగ్ లేదా ఫ్లిప్ చేయడం మంచిదికాదు. అన్ని సీజన్స్‌లోనూ ఆరోగ్యకరమే.. ఈ వర్కవుట్ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా మారింది. దీని కోసం సింగపూర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏరోబిక్ అండ్ ఫిట్నెస్ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న స్ట్రోక్స్‌తో పార్ట్నర్గా ఆక్వా వర్కవుట్స్‌లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్ శిక్షకురాలు -
’నీలి’ నాగు
సాగు, తాగునీరు కలుషితం కాలువలు, చెరువుల్లోకి వ్యర్థ నీరు డెల్టాలో దుస్థితి దెబ్బతింటున్న నారుమళ్లు రైతులు, ప్రజలు బెంబేలు పట్టించుకోని అధికారులు డెల్టాపై నీలినాగు పడగ విప్పింది. ఆక్వా సాగు(నీలివిప్లవం) చాపకింద నీరులా పాకుతోంది. అనుమతి లేకుండా రొయ్యల సాగు యథేచ్ఛగా జరుగుతోంది. అక్రమార్కులు చెరువుల్లోని కాలుష్య నీటిని పంటకాలువల్లోకి తోడేస్తుండడంతో సాగు, తాగునీరు కలుషితమవుతోంది. ఫలితంగా వరి నారుమళ్ల దశలోనే దెబ్బతింటోంది. తాగునీటి చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఆకివీడు : పశ్చిమడెల్టా ఒకప్పుడు పైరు పచ్చని సీమ. ధాన్యాగారం. సుమారు ఆరు లక్షల 20వేల ఎకరాల్లో విస్తరించిన ఈ ఆయకట్టులో ఎంత కష్టించినా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయి పెట్టుబడి దక్కకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిరాశజనకంగా ఉండడంతో రైతులు వరి సాగు నుంచి నీలి విప్లవం(ఆక్వా సాగు) వైపు అడుగులు వేశారు. ఫలితంగా పొలాలు చేలుగా మారాయి. ప్రస్తుతం ఆయకట్టులో సుమారు 54వేల ఎకరాలు చేపలు చెరువులు ఉన్నాయి. మరో లక్ష ఎకరాల్లో చేపల చెరువుల పేరిట అనధికారికంగా రొయ్యల సాగు జరుగుతోంది. ఇవికాక అనుమతి పొందిన రొయ్యల చెరువులు 15వేల ఎకరాలు ఉన్నాయి. పడగ విప్పిన కాలుష్యం ఆక్వా చెరువుల వల్ల కాలుష్యం పడగ విప్పింది. ముఖ్యంగా రొయ్యల చెరువుల నుంచి వెలువడే వ్యర్థ ఉప్పునీరు వల్ల అనర్థం జరుగుతోంది. చెరువుల సాగుదారులు వ్యర్థనీటిని మురుగు కాలువల్లోకి వదలాల్సి ఉండగా, అలా చేయకుండా యథేచ్ఛగా పంట కాలువల్లోకి తోడేస్తున్నారు. ఫలితంగా 11 పంట కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ ప్రభావం సాగు, తాగునీటిపై పడుతోంది. పంట కాలువల్లోని ఉప్పునీరు వరి పొలాల్లోకి చొచ్చుకెళ్లి నారుమళ్లు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం డెల్టా వ్యాప్తంగా సుమారు 50వేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నట్టు అంచనా. అలాగే డెల్టాలోని తాగునీటి చెరువులకు పంట కాలువల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల 300 తాగునీటి చెరువులూ కాలుష్య కాసారాలుగా మారుతున్నట్టు సమాచారం. ఈ నీటిని శుద్ధిచేసినా.. స్వచ్ఛ తాగునీరు సరఫరా సాధ్యం కావడం లేదని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే డెల్టాలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాలువల వ్యవస్థ మారాలి కాలుష్యం నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా డెల్టాలోని కాలువల వ్యవస్థను మార్చాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. చేపలు, రొయ్యల చెరువులకు ప్రత్యేకంగా మురుగు బోదెలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దీనికోసం అధికారులు తక్షణం చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయాలి గోదావరితోపాటు, ప్రధాన పంట కాలువలు పూర్తిగా కాలుష్యానికి గురయ్యాయి. డెల్టాకు వచ్చే 11 కాలువల్లోకి మురుగునీరు, ఫ్యాక్టరీల వ్యర్థ నీరు చొచ్చుకువస్తోంది. రాజమండ్రి నుంచి ప్రధాన మురుగు కాలువ నీరు గోదావరిలోకి రావడం వల్ల ఆ నీరు దిగువ ప్రాంతమైన పశ్చిమ డెల్టాకు సరఫరా అవుతోంది. కాలుష్యం బారి నుంచి కొంతైనా బయటపడేందుకు తాగునీటి కోసం ప్రత్యేక పైప్లైన్లు డెల్టా అంతా ఏర్పాటు చేసి, చెరువుల్లోకి అమర్చాలి. దీనికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. దీనిని సర్కారు దృష్టికి తీసుకెళ్తాం. ఎం.వి.సూర్యనారాయణరాజు, పర్యావరణ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు. మురుగు కాలువల్లోకే వదలాలి ఆక్వా చెరువుల్లోని వ్యర్థ నీటిని మురుగు కాలువల్లోకే వదలాలి. డెల్టాలో 1.54 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది.15 వేల ఎకరాల్లో మాత్రమే అనుమతి పొందిన రొయ్యల చెరువులు ఉన్నాయి. అనుమతి లేని చెరువులపై సర్వే జరుగుతోంది. ఫణి కిషోర్, డిప్యూటీ డైరెక్టర్, నీటిపారుదల శాఖ, భీమవరం. -
’ఆక్వా’రిష్టం
బరితెగిస్తున్న మాఫియా అన్నదాతకు తీరని నష్టం మామూళ్ల మత్తులో అధికారులు జిల్లాలోని అన్నదాతలకు ’ఆక్వా’రిష్టం దాపురించింది. పచ్చని చేలు అక్రమార్కుల ధన దాహానికి చెరువులుగా మారిపోతున్నాయి. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులూ వంతపాడుతున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆక్వా మాఫియా బరితెగిస్తోంది. అనుమతులు లేకుండానే వేలాది ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం సాగిస్తోంది. తర్వాత వాటిని రొయ్యల చెరువులుగా మార్చేస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వేలాది ఎకరాల్లో అక్రమంగా రొయ్యలసాగు జరుగుతోంది. వీటి నుంచి పంట కాలువల్లోకి విడుదలవుతున్న కాలుష్య నీరు పొలాలను ముంచెత్తుతోంది. తాజాగా నిడమర్రు మండలంలోని అడవికొలనుతోపాటు పలుగ్రామాల్లో వేలాది ఎకరాల్లో రబీ నారుమళ్లు, నాట్లు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారంతా కౌలురైతులే. నారుమళ్ల కోసం ఆ రైతులు రూ.ఐదువేల నుంచి రూ.పదివేల వరకూ ఖర్చుచేశారు. ఈ ఖర్చంతా నీటిపాలైంది. పంట కాలువలూ పచ్చగా మారాయి. దీనిపై రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మత్య్సశాఖ ఉన్నతాధికారులు వచ్చి చూసి వెళ్లారు. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు ఉండటం వల్లే అక్రమార్కులను అధికారులు ఏం చేయలేకపోతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నిడమర్రు మండలంలో ఉన్నన్ని అనధికారిక చెరువులు జిల్లాలో ఎక్కడా లేవు. ప్రభుత్వ అన్ సర్వే భూములనూ చెరువుల్లో అక్రమార్కులు కలిపేసుకున్నట్టు సమాచారం. అడవికొలనులో 85 సెంట్ల ప్రభుత్వ భూమినీ కలిపేసుకుని కొందరు చెరువులు తవ్వేసుకున్నారు. పెదనండ్రకొలను, అడవికొలను గ్రామాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేశారు. సాధారణంగా చేపల చెరువులకు రెండు అనుమతులు ఉంటాయి. తాత్కాలిక అనుమతితో చెరువు తవ్వుకోవచ్చుగానీ, నీరు నింపే అవకాశం లేదు. శాశ్వత అనుమతి వస్తేనే చేపల పెంపకానికి అనుమతి ఉంటుంది. అయితే తాత్కాలిక అనుమతులతోనే అక్రమార్కులు చేపల చెరువులు తవ్వేసి వాటిని తర్వాత రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అసలు రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రభుత్వ అనుమతులు లేవు. కానీ నిడమర్రు మండలంలో చేపల, రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతోంది. వీటిల్లో పట్టుబడి కోసం నీటిని వదిలివేయడంతో చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. నీళ్లు ఒక్కసారిగా వదలడంతో చాలాచోట్ల నారుమళ్లు నీట మునిగి కుళ్లిపోయాయి. అడవికొలను గ్రామం కలందకోడు పాయ, దొంగపర్రు, దాళ్వాపర్రిపాయల్లో నారుమళ్లు మొత్తం నాశనమైపోయాయి. దాదాపు రెండువేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశకు చేరుకున్న నారు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతోపాటు రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం వల్లే ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిడమర్రుతోపాటు అడవికొలను, పెదనిండ్రకొలనుల్లో చేపల చెరువులుగా మారిన అత్యధిక పొలాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధాన రహదారికి పక్కనే రొయ్యల సాగు జరుగుతున్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా.. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు. ప్రశ్నించిన రైతులకు ఆక్వా మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు పడతారంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నారుమళ్లు నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. నారుమళ్లు నష్టపోవడంతో ఇప్పుడు వేరే చోట నారు కొని తెచ్చి నాట్లు వేసినా ఆ తర్వాత చెరువుల నుంచి కలుషిత నీరు వదిలితే ఏం చేయాలోనని మధనపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. . -
యాంటీ బయోటిక్స్ వాడితే కొనుగోలు చేయం
భీమవరం : రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ వాడినట్టు గుర్తిస్తే ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోలు నిలిపివేయనున్నట్టు ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రకటించారు. భీమవరంలో ఆదివారం యాంటీ బయోటిక్స్ వాడకంపై ఆక్వా రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం నుంచి యూఎస్ఏకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయన్నారు. మనం ఉత్పత్తి చేసే రొయ్యలు గతంలో 25 శాతం యుఎస్ఏకు ఎగుమతి అయితే ప్రస్తుతం ఆశాతం 45కు పెరిగిందన్నారు. మిగిలిన సరుకు థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. రొయ్యల్లో యాంటిబయోటెక్స్ కనిపిస్తున్నందున మన రొయ్యలను దిగుమతి చేసుకునే దేశాలు అభ్యంతరం చెబుతున్నాయని అక్కడికి వెళ్లిన రొయ్యల కంటైనర్స్ తిరిగి రావడం వల్ల తీవ్రంగా నష్టపోతామని అందువల్ల ఇక్కడే యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించి రొయ్యల కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమష్టిగా నిలిపేయాలి రొయ్యల కొనుగోలుదారుల నేషనల్ కమిటీ సభ్యుడు తోట జగదీష్ మాట్లాడుతూ రొయ్యలసాగులో యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల ఎక్కువగా నష్టపోయేది రైతులేనని, అయితే రైతులు నష్టపోతే మొత్తం ఆక్వారంగానికే చేటు కలుగుతుందన్నారు. ఏపీ రీజియన్ ప్రెసిడెంట్ ఎ.ఇంద్రకుమార్ మాట్లాడుతూ రొయ్యలు సాగుచేసే రైతులంతా సమష్టిగా యాంటి బయోటిక్స్ వాడకాన్ని నిలిపివేస్తేనే ఆక్వారంగానికి మనుగడ ఉంటుందన్నారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ యిర్రింకి సూర్యారావు మాట్లాడుతూ ఇటీవల రొయ్యల ధర ఆశాజనకంగా ఉండడంతో పెద్దగా ఇబ్బందులు లేవని తక్కువ కౌంట్æరొయ్యలను కూడా అధికధరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టాలు లేకుండా బయటపడుతున్నారన్నారు. దిగుమతులు నిలిచిపోతే ఆక్వా రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులనే బాధ్యులను చేయడం సరికాదు కొణితివాడ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణరాజు మాట్లాడుతూ యాంటిబయోటిక్స్ వాడకంపై కేవలం రైతులను నష్టపర్చే విధంగాకాకుండా హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు. టెక్నీషియన్స్ కూడా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామానికి చెందిన రైతు ఇంటి శ్రీరాముడు మాట్లాడుతూ యాంటీబయోటెక్స్ వాడకంపై కేవలం రైతులను బాధ్యులను చేయడం భావ్యం కాదని హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వపరంగా దాడులు చేసి యాంటీబయోటిక్స్‌ను అరికట్టాలన్నారు. దీనికిగాను ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ శ్రద్ధ తీసుకుని హేచరీ యజమానులు, రైతులు, మందులు, మేతల తయారీ కంపెనీలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో ఆక్వాకల్చర్ కమిటీ నాయకులు సి.రాజగోపాలచౌదరి, వి.సత్యనారాయణరాజు, రమేష్‌వర్మ, జి.పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.