breaking news
-
‘స్థానిక’ ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ గురువారం కలిశారు.గత అనుభవాల దృష్ట్యా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమరి్పంచారు. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించాలని, నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషన్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులను బెదిరిస్తున్నారు: గడికోట స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నిజాయితీపరులు, సమర్థులైన అధికారులను నియమించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరామని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పటినుంచే అభ్యర్థులను ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పులివెందులలో బీటెక్ రవి అనే నాయకుడు ‘ఎవరు నామినేషన్ వేస్తారో చూస్తా’మంటూ నేరుగా ప్రెస్మీట్లో బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నామినేషన్లు ఆన్లైన్లో దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించాలి: మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన పోలీసు బందోబస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని కుట్రలు చేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల కమిషనర్‌ను కోరామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వంపై ఓట్ల రూపంలో వ్యతిరేకత ప్రతిబింబించకుండా అడ్డుకోవడానికి కూటమి నాయకులు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారన్నారు. అభ్యర్థులు కనీసం నామినేషన్ కూడా వేయకుండా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపించకుండా కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే పూర్తి అధికారం ఇస్తే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు ఉండవని చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ కలగజేసుకుని పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరామన్నారు. నామినేషన్ వేసిన ప్రతి అభ్యరి్థకి పోలీసులతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశామనితెలిపారు. ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరాం: దేవినేని అవినాశ్ ఇటీవల తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కారో రాష్ట్ర ప్రజలంతా చూశారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని గుర్తు చేశారు. లొంగని వారిని బెదిరించి, కిడ్నాప్ చేసి కూటమి వైపు తిప్పుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఇలాగే అడ్డదారులు తొక్కి చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్, ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. -
మూడు సంపుటాలు.. వేయి పేజీలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. మూడు సంపుటాల్లో నివేదికను సిద్ధం చేశారు. 650కిపైగా పేజీలతో ప్రధాన నివేదిక అందజేసినట్లు జస్టిస్ ఘోష్ పేర్కొనగా.. అనుబంధాలతో కలిపి మొత్తం మూడు సంపుటాలుగా ఇచ్చిన నివేదికలో వెయ్యికిపైగా పేజీలునున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘో‹Ùతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధ్యులు వారేనా? బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లను కమిషన్ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల స్థల ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్‌లు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన కమిషన్.. ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా ప్రశ్నలను సంధించింది. విచారణ చివర్లో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయాల ఆధారంగానే బరాజ్‌ల నిర్మాణ పనులు జరిగాయని మాజీ మంత్రులిద్దరితోపాటు కేసీఆర్ కమిషన్ ఎదుట వాగ్మూలం ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనలను ఖండిస్తూ అసలు గత ప్రభుత్వంలోని జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు జరగలేదని తేలి్చంది. దీనికి సమర్థనగా గత ప్రభుత్వంలో జరిగిన కేబినెట్ సమావేశాలకు సంబంధించిన తీర్మానాల ప్రతులతో కమిషన్‌కు నివేదిక అందించింది. బరాజ్‌లకు సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారనే అంశాన్ని నిర్ధారించడానికి ఈ నివేదిక కీలకం కానుంది. ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ స్థల మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారనే అంశంపై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా పలువురు సాక్షులను ప్రశ్నించింది. చాలా మంది సాక్షులు దీనికి సమాధానంగా ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌ల పేర్లను ఉటంకించారు. విచారణకు హాజరైన సాక్షుల్లోనే పలువురి పాత్రపై ఆధారాలను సేకరించిన కమిషన్.. వారినే బాధ్యులుగా నిర్ధారిస్తూ నివేదికలో పొందపరిచినట్లు సమాచారం. నేడు సీఎంకు నివేదిక.. జస్టిస్ ఘోష్ గురువారం సమర్పించిన నివేదిక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చేరగా.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆ నివేదికను అందచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం నివేదికను మీడియాకు బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు. అంశాలకు కట్టుబడే నివేదిక.. జస్టిస్ ఘోష్ ప్రభుత్వం కమిషన్‌కు నిర్దేశించిన అంశాలకే పరిమితమై నివేదికను సిద్ధం చేసినట్లు జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి సిఫారసులు చేయలేదని మీడియాకు తెలియజేశారు. సర్కారుకు నివేదిక అందించడంతో తన బాధ్యత తీరిందన్నారు. ఇకపై కమిషన్ కార్యకలాపాల కోసం హైదరాబాద్‌కు రానన్నారు. సర్కారు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించగా అది తనకు తెలియదన్నారు. బాధ్యులెవరు? ప్రజాధన దుర్వినియోగం ఎంత? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరు/ఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ అంశాలు, నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం, ఇతర అవకతవకతలపై విచారణ జరపాలని కోరింది. అసమంజస రీతిలో ఒప్పందాల గడువు పొడిగింపు, పనులు పూర్తయినట్లు తప్పుడు సరి్టఫికేట్ల జారీ, గడువు పూర్తికాక ముందే బ్యాంక్ గ్యారెంటీల విడుదల, తదితర చర్యలతో నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించిన వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత అధికారులు/సంస్థలను బాధ్యులుగా నిర్ధారించాలని సూచించింది. అంశాలవారీగా బాధ్యులను గుర్తించడంతోపాటు దుర్వినియోగమైన నిధులను కమిషన్ నిర్ధారించి నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. -
బీజీ కొత్తూరులో ‘నవోదయ’
● 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు ● త్వరలోనే విద్యాలయ భవనం పనులు ప్రారంభించేందుకు కసరత్తు అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరులో జవ హర్నవోదయ విద్యాలయం ఏర్పాటు కానుంది. నవో దయ విద్యాలయం నిర్మాణానికి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఇటీవల సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం కన్సల్టెంట్ టెండర్లు పూర్తి కాగా సుమారు రూ.70 కోట్లతో విద్యాలయం భవనం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో తొలి నవోదయ విద్యాలయం.. అప్పట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయం ఉండగా తరువా త భద్రాచలంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేశారు. రాష్ట్రవిభజనలో అది ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లగా జిల్లాలో నవోదయ విద్యాలయం లేకుండాపోయింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నవోదయ విద్యాలయం ఏర్పాటుతో జిల్లాలో తొలి నవోదయ విద్యాలయం కానుంది. 2022లో మంజూరు.. గత ప్రభుత్వ హయాంలో 2022లో కేంద్ర ప్రభు త్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేసింది. పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం బీజీ కొత్తూ రు వద్ద నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయా లని భావించారు. బీజీ కొత్తూరులో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించి విద్యాలయానికి కేటాయిస్తూ సంబంధిత అధికారులకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు భూమిని సందర్శించారు. బీజీ కొత్తూరు నుంచి నవోదయ విద్యాలయం వరకు రూ.1.50 కోట్లతో రహదారికి అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. నవోదయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటవుతుందా లేదా ఇతర ప్రాంతాలకు తరలిస్తారా అన్న సందేహాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. గతంలో గుర్తించిన 30 ఎకరాల భూమినే నవోదయ విద్యాలయానికి కేటాయిస్తూ భూమిని అప్పగించడంతో నవోదయ విద్యాలయం ఏర్పాటు కల నెరవేరబోతోందని ఈ ప్రాంత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే తరగతులు.. ఈ ఏడాది నుంచే జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం కానుంది. తొలుత ఆరో తరగతిలో 40 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఎంపికై న విద్యార్థులకు కరకగూడెంలో తాత్కాలికంగా ఓ అద్దె భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. బీజీ కొత్తూరు వద్ద విద్యాలయం నిర్మాణ పనులు పూర్తి కాగానే తరువాత విద్యాలయాన్ని ఇక్కడికి తరలిస్తారు. -
పలువురికి బళ్లారి రాఘవ అవార్డులు
అనంతపురం కల్చరల్: జిల్లా వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కళాకారులకు బళ్లారి రాఘవ అవార్డులు దక్కాయి. ప్రపంచ నాటక రంగాన్ని ప్రభావితం చేసిన ‘అనంత’ రంగస్థల యోధుడు బళ్లారి రాఘవ జయంతిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం అనంతపురంలోని లలితకళాపరిషత్తులో ప్రత్యేక ఉత్సవాలు, సాంస్కృతిక, నాటక సంబరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన నటులు, రచయితలకు పురస్కారాలనందిస్తున్నట్లు ఎల్కేపి కార్యదర్శి పద్మజ వెల్లడించారు. అవార్డులు దక్కిన వారిలో కర్నూలుకు చెందిన రామలింగేశ్వరరావు, బాపట్ల జిల్లా రేపల్లెకు నివాసి భూపతి ధర్మారావు, అనంతపురం జిల్లాకు చెందిన వాల్మీకి కుళ్లాయప్ప, మల్లెల జయరామ్ ఉన్నారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు ఎస్ఎం బాషా ఆధ్వర్యంలో ‘గోవు మా లచ్చిమి’ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. -
మఠం ఆస్తుల పరిరక్షణకు చర్యలు
ఉరవకొండ: కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఉన్న విలువైన గవిమఠం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు ఉరవకొండ గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి తెలిపారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో అన్యాక్రాంతమైన రూ.కోటి విలువైన భూమిని న్యాయపోరాటంతో సాధించుకున్నట్లు వివరించారు. గురువారం స్థానిక గవిమఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తరాధికారి మాట్లాడారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా దేవసముద్రం హోబళి కృష్ణరాజపురం గ్రామంలో సర్వే నంబర్ 39లో మఠానికి రూ.కోటి విలువ చేసే 10 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని సిద్దయ్య స్వామి అనే అర్చకుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. ఆయన మృతి అనంతరం అతని భార్య రుద్రమ్మ మఠం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో విషయం తెలిసి ఈ ఏడాది జూలై 16న చిత్రదుర్గ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం మఠానికి చెందిన భూమిని అర్చకుల పేరు మీద చేసేందుకు హక్కులేదని, వాటిని అర్చకులు అనుభవించేందుకు మాత్రమే వీలుందని న్యాయస్థానం వెల్లడి చేసిందన్నారు. రికార్డుల్లో పేర్లు మార్చడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను కోర్టు మందలించిందన్నారు. దీంతో ఆ భూమికి సంబంధించి హక్కులు గవి మఠానికి కల్పిస్తూ ఆన్లైన్ రికార్డుల్లో పొందుపరిచారన్నారు. ఉరవకొండ గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి -
శాసనాల ఖిల్లా.. మన జిల్లా
అద్దంకి: నూతనంగా ఏర్పడిన బాపట్లజిల్లా శాసనాలకు ఖిల్లాగా నిలుస్తోంది. క్రీస్తు పూర్వం నుంచి, వివిధ రాజవంశాల వారు బాపట్ల ప్రాంతాన్ని ఏలినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఆయా కాలాల్లో వేసిన రాతి శాసనాలు బయట పడటం వలన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా శాసనాలను బట్టి ఈ ప్రాంతాన్ని చోళులు, పల్లవులు, గజపతులు, కాకతీయులు, చాళుక్యులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఏలినట్లు తెలుస్తోంది. ఆ నిలువెత్తు సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. బౌద్ధ, జైన మతాలకు సైతం ఈ ప్రాంతంలో పరిఢవిల్లినట్లు ధర్మవరం, భట్టిప్రోలు ప్రాంతాల్లోని ఆనవాళ్లు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం నుంచే.. బాపట్ల ప్రాతంలోని పట్టణాలు, గ్రామాలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచే ఉన్నట్లుగా చిన్నగంజాం, పెద్దగంజాం, భట్టిప్రోలులోని బౌద్ధ స్థూపం చెబుతోంది. ధర్మవరం, అద్దంకి, ధేనువకొండ, మణికేశ్వరం, పేరాయిపాలెం ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం 9 నుంచి 5వ శతాబ్దం నాటి రాతి సమాధులు (రాక్షసగూళ్లు) లభించాయి. అద్దంకి మండలంలోని నాగులపాడు గ్రామంలోని చెరువులో 7వ శతాబ్దంలో అయ్యమాపయ్య వేయించిన దాన శాసనం, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లిలో 12వ శతాబ్దం నాటి చోళుల శాసనం, పర్చూరు మండలంలోని ఉప్పుటూరు, నూతలపాడు, చెరుకూరులోని త్రివిక్రమ దేవాలయంలోని దాన శాసనం, బాపట్లలోని భావన్నారాయణ స్వామి ఆలయంలోని చోళుల శాసనాల ద్వారా లభించింది. అద్దంకిలో తొలి తెలుగు పద్యశాసనం అద్దంకిలో పండరంగడు క్రీస్తుశకం 848లో తన గురువుకు 8 పుట్ల అట్ల పట్టు నేల దానం చేసిన సమయంలో వేయించిన తొలి తెలుగు పద్య శాసనం ఉంది. కొణిదెనలో 11, 12, 13వ శతాబ్దం నాటి మూడు శాసనాలు, కుమార సంభవం కర్త చోళ మహారాజు నన్నే చోళుడు వేయించిన 11వ శతాబ్దం నాటి శాసనం శివాలయంలో లభించింది. దేశంలోనే తొలిసారిగా చిన్నగంజాం మోటుపల్లి రేవు నుంచి సమగ్ర వర్తక వ్యాపారం కోసం వేయించిన అభయ శాసనం, ఓడల ద్వారా సుగంధద్రవ్యాలు, గుర్రాలు, వజ్రాల ఎగుమతి, దిగుమతులు చేసే వ్యాపారంపై 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని శాసనంలో రకరకాలైన వస్తువులపై రాయితీ కల్పిస్తూ వేసిన శాసనం, 14వ శాతాబ్దంలో వేయించిన అనపోతారెడ్డి వేయించిన శాసనం ఇలాంటివే. ఇవి తెలుగు, తమిళభాషల్లో ఉన్నాయి. ఈ రేవు నుంచి సన్నని నూలు వస్త్రాలు, రవెల్లాలు(నేత) దిగుమతి చేసుకునే వారు. అద్దంకి, రావూరులో గజపతుల 16వ శతాబ్దం నాటివి, మోటుపల్లి, పమిడిపాడులో విజయనగర రాజులు, తక్కెళ్లపాడు, పోతవరంలో పంట మల్లారెడ్డి, కుందుర్రులో కృష్ణదేవరాయలు, చుండూరులో అచ్యుత రాయలు, బొల్లాపల్లి, మణికేశ్వరంలో సదాశివరాయుడు, ధర్మవరంలో గొల్కొండ నవాబు వేయించిన శాసనాల ద్వారా ఆయా కాలాల్లో రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని ఏలినట్లు ధ్రువపడుతోంది. ఎన్నో రాజవంశాలు పాలించిన పురాతన ప్రాంతంగా ప్రసిద్ధి నిదర్శనంగా నిలుస్తున్న పలు ఆనవాళ్లు బౌద్ధ, జైన మతాలకు ఆలవాలం మ్యూజియం ఏర్పాటు చేయాలి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బయటపడిన శాసనాల ప్రతులను, వివిధ రకాల వస్తువులను భావితరాలకు తెలిసేలా ఏర్పాట్లు అవసరం. సందర్శకుల కోసమైనా పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పుడు మన పూర్వ చరిత్ర పదిలంగా ఉంటుంది. – జ్యోతి చంద్రమౌళి, శాసనాల పరిశోధకుడు -
చిత్తూరు అభివృద్ధికి కృషి
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి కోరారు. ఈ మేరకు గురువారం ఆ సొసైటీ సభ్యులు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీని కలిసి ప్రణాళిక అందజేశారు. ఆయన మాట్లా డుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాకు ఏళ్ల సంవత్సరాల ఘన చరిత్ర ఉందన్నారు. చిత్తూరును టూరిజం కారిడార్‌గా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ జలాశయం వద్ద త్రివేణి సంగమం, పుష్కర ఘాట్, అష్టదేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతామన్నారు. కలవగుంట వద్ద 108 అడుగుల శివుని విగ్రహం, త్రివేణి సంగమం, పుష్కర ఘాట్లను నిర్మిస్తామన్నారు. చిత్తూరులోని నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద నెమలి, గరుడ, నంది విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సొసైటీ సభ్యులు చంద్రబాబు, శివకుమార్, అశోక్ పాల్గొన్నారు. -
కొత్త దుకాణాలు లేనట్టే..!
టెండర్ డిపాజిట్ ధర పెంపు ? గతంలో టెండర్లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ డబ్బు తిరిగి రాదు ప్రభుత్వానికే చెందుతుంది. అయితే ఈసారి దరఖాస్తుల ధరను మరింతగా పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది.జనాభా లెక్కలు తేలితేనే అదనపు మద్యం షాపులు ఫ 2023లో ఉన్నవాటికే టెండర్లు పిలువనున్న ఎకై ్సజ్ శాఖ ఫ ఈ సారి కూడా ఆగస్టులోనే షెడ్యూల్ జారీకి అవకాశం ఫ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి అదనపు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఉన్న పాత దుకాణాలకు మాత్రమే త్వరలో టెండర్లు కోసం షెడ్యూల్ జారీ చేసేందుకు ఎకై ్సజ్ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఉన్న దుకాణాల కంటే అదనంగా పెంచాలంటే కొత్త జనాభా లెక్కలు రావాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున ప్రతి 5వేల మందికి ఒక మద్యం దుకాణం చొప్పున అధికారులు గతంలోనే పెంచారు. వాటి ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా షాపులకు అనుమతి ఇవ్వకుండా ఉన్న దుకాణాలకే టెండర్లు పిలువనున్నారు. క్లస్టర్ పరిధిలో షాపుల మార్పు.. నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. ఒక్క వార్డుకు రెండు నుంచి మూడు లెక్కన కేటాయించారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఉన్న షాపులు ఏవైనా సక్రమంగా నడడవం లేదని, దరఖాస్తు చేసుకుంటే ఆ క్లస్టర్ పరిధిలోనే ఒకే స్లాబ్ విధానం ఉన్న ప్రాంతానికి మద్యం షాపును మార్చుకునేందుకు అనుమతి ఇస్తారు. సాధారణంగా జిల్లాలో క్లస్టర్ జనాభా స్లాబ్‌ను బట్టి షాపుల లైసెన్స్ ఫీజులను ఫీజులను ఖరారు చేశారు. 5 వేల జనాభా ఉంటే రూ.50 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 నుంచి 10 వేల జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు, 10నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉంటే రూ.65 లక్షలు, లక్షకు జనాభా ఆపైన ఉంటే రూ.కోటి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా స్లాబ్‌ల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం షాపులు ఉండగా అందులో 95షాపులు మాత్రమే పది రెట్ల రెవెన్యూ దాటాయి. మిగిలినవి ఏడెనిమిది రెట్లు మాత్రమే అమ్మకాల లక్ష్యాన్ని దాటాయి. ఇంకా నాలుగు నెలలు గడువు ఉంది కాబట్టి అన్ని షాపులు పది రెట్ల అమ్మకాలను దాటే అవకావం ఉందని ఽఅధికారులు చెబుతున్నారు. ఏదైనా ఒక షాపులో ఆ మేరకు అమ్మకాలు జరక్కపోతే ఆ క్టస్టర్ పరిధిలో, అదే స్లాబ్ విధానం ఉన్న ప్రాంతానికి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 2023లో దరఖాస్తులు 7,057 రెండేళ్ల కిందట జిల్లాలోని 155 మద్యం షాపులకు టెండర్లు పిలువగా 7,057 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కనగల్ మండలం దర్వేశిపురం మద్యం దుకాణానికి 187 మంది పోటీ పడి దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోనే ఈ దుకాణానికే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. పోటీపడిన వారిలో కొందరు ఐదారు దరఖాస్తు చేయగా, సింగిల్ టెండర్ వేసిన వ్యక్తికే డ్రాలో దక్కింది. ఈ సారి పెరగనున్న దరఖాస్తులు ఈసారి కూడా మద్యం షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గతంలో చాలా మంది టీంలుగా ఏర్పడి 10 నుంచి 20 షాపులకు టెండర్లు వేశారు. షాపులు వచ్చిన వారినుంచి రానివారు చాలా మంది కొన్నారు. దాంతో ఈసారి కూడా టెండర్లలో పాల్గొనేందుకు చాలామంది సిద్ధమవుతన్నారు. త్వరలో మద్యం షాపుల టెండర్ల షెడ్యూల్ జిల్లాలో త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల తెరిచారు. ప్రస్తుతం జిల్లాలోని 155 మద్యం షాపుల లైసెన్స్ గడవు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాల్సి ఉంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగస్టు నెలలోనే మొదలైతే అందుకు కనీసంగా మూడు నెలల సమయం పట్టనుంది. ఆ సమయంలో దుకాణాల టెండర్లు నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే గతంలో మాదిరిగానే టెండర్ల ప్రక్రియను ముందుగానే నిర్వహించాలని ఎకై ్సజ్ శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. -
నకిలీ ఏటీఎం కార్డులిచ్చి..
ఆత్మకూరు: నగదు తీసుకునేందుకు ఏటీఎంల వద్దకు వెళ్లే వారిని మోసం చేసి కార్డు, పిన్ నంబర్లను తెలుసుకుని నగదు దోచుకుంటున్న వ్యక్తిని కొందరు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, ఎస్సై జిలానీ కథనం మేరకు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మట్టిపాడు గ్రామానికి చెందిన సురేంద్ర అనే యువకుడు ఏటీఎంల వద్ద ప్రజలను ఏమారుస్తుంటాడు. నగదు విత్‌డ్రా చేయాలని కోరుతూ కార్డులిచ్చే వారిని మోసం చేస్తుంటాడు. పిన్ నంబర్ తెలుసుకుని నకిలీ కార్డు చేతిలో పెడుతుంటాడు. గురువారం ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద వృద్ధుడికి నగదు తీసుకోవడంలో సహాయం చేస్తానని నమ్మించాడు. ఆయన కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని నగదు డ్రా చేసి నకిలీ కార్డు ఇచ్చాడు. కొద్దిసేపటి అనంతరం మరో యువకుడికి ఇలానే చేయబోగా సురేంద్ర మోసాన్ని పసిగట్టి సమీపంలోని వారి సహకారంతో పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పరిశీలించగా సురేంద్ర వద్ద పలు నకిలీ ఏటీఎం కార్డులు లభించాయి. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇప్పటికే కేసులు నమోదైనట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అసలు వాటితో నగదు కొల్లగొడుతున్న వ్యక్తి పోలీసులకు అప్పగించిన స్థానికులు -
అది ప్రమాదం కాదు.. హత్యే
● వ్యక్తి హత్య కేసులో వీడిన మిస్టరీ ● భార్యనే సూత్రధారి ● కుమారుడు, అక్క కుమారుడితో కలసి కుట్ర ● నిందితుల అరెస్ట్ గార్లదిన్నె: గత నెల కారు ఢీకొని రైతు మృతి చెందిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. అది ప్రమాదం కాదని, పథకం ప్రకారం కుటుంబసభ్యులే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు నిర్ధారించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గార్లదినెన్న పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు. గార్లదిన్నె మండలం జంబులదిన్నె గ్రామానికి చెందిన బోయ నల్లప్ప (50)కు 30 ఏళ్ల క్రితం శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 25 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నల్లప్ప తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్రెడ్డిపల్లి సమీపంలో ఉన్న క్వారీలో పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ మహిళతో సన్నిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్థిక సాయం అందిస్తూ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసి భార్య సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. అయితే భార్యకు విడాకులు ఇచ్చేందుకై నా సిద్ధమని, ఆ మహిళను మాత్రం తాను వీడి ఉండలేనని నల్లప్ప స్పష్టం చేయడంతో మనస్పర్తలు చెలరేగి ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం లక్ష్మి తన పిల్లలతో కలసి కల్లూరు నివాసముంటోంది. నల్లప్ప అనంతపురం సమీపంలోని సోములదొడ్డిలో ఒంటరిగా ఉంటూ రోజూ ద్విచక్ర వాహనంపై ఓబులాపురం వద్ద ఉన్న తోటకు వచ్చి వెళ్లేవాడు. అప్పుడప్పుడు తెలంగాణలో ఉంటున్న మహిళ వద్దకెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆస్తి కూడా ఆమె పేరునే రాసిస్తాడనే అనుమానాలు వ్యక్తం కావడంతో భార్య లక్ష్మి ఆందోళనకు గురైంది. దీంతో పిల్లలకు ఆస్తి దక్కాలనే ఆలోచనతో ఎలాగైనా భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న ఆమె... తన కుమారుడు ఆశ్రయ్, పెద్దవడుగూరు మండలం చిత్రచేడులో ఉంటున్న అక్క కుమారుడు శ్రీకాంత్ కలసి నల్లప్ప హత్యకు పథకం రచించారు. పథకంలో భాగంగా జూలై 23న నల్లప్ప ద్విచక్ర వాహనంపై వ్యవసాయ తోట వద్ద నుంచి తిరిగి వస్తుండగా జంబులదిన్నె కొట్టాల సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి ఇన్నోవా కారుతో ఢీకొని హతమార్చారు. హత్యకు ఉపయోగించిన కారును అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అయితే తొలుత ప్రమాదంలో రైతు మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా భార్య, కుమారుడిని విచారణ చేయడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో లక్ష్మి, ఆమె కుమారుడు ఆశ్రయ్, అక్క కుమారుడు శ్రీకాంత్‌ని గురువారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ కౌలట్లయ్య, ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.