breaking news
-
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసపు రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగురంగు పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు అందజేశారు. -
స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ షురూ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషి యల్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) వి డుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్ ఫోన్లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్‌లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొ టో అప్లోడ్ అయ్యేందు కు అరగంట సమ యం పట్టిందని పలువు రు ఉ పాధ్యాయులు తెలిపా రు. సాంకేతిక సమస్య ఇ లాగే కొనసాగితే అటెండె న్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ నమోదు వివరాలు..జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు రిజిస్ట్రేషన్ శాతం ర్యాంకు వరంగల్ 534 3,211 2,085 64.93 08 హనుమకొండ 472 2,987 1,883 63.04 16 మహబూబాబాద్ 768 3,859 2,231 57.81 26 జనగామ 459 2,773 1,572 56.69 27 ములుగు 337 1,557 832 53.44 29 జేఎస్.భూపాలపల్లి 414 1,927 901 46.76 33 -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్‌కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్‌లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాట రూపంలో రాశా. –కాసర్ల శ్యామ్, పాటల రచయిత జిల్లావాసి కాసర్ల శ్యామ్‌కు నేషనల్ అవార్డు ఉత్తమ లిరిక్‌రైటర్‌గా గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
● జిల్లావాసి కాసర్ల శ్యామ్‌కు నేషనల్ అవార్డు ● ఉత్తమ లిరిక్‌రైటర్‌గా గుర్తింపు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులుహన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్‌కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్‌లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత -
రైల్వేస్టేషన్లలో మెరుగైన వసతులు
● డీఆర్ఎం గోపాలకృష్ణన్ మహబూబాబాద్ రూరల్ : ప్రయాణికుల అవసరాల మేరకు రైల్వే స్టేషన్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న డీఆర్ఎం.. నిర్మాణ పనులు పరిశీలించి గడువులోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. డీఆర్ఎంను కలిసిన ఎమ్మెల్యే.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కొత్త బజారు వైపున నాలుగో ప్లాట్ ఫామ్ నిర్మించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్.. డీఆర్ఎం గోపాలకృష్ణన్‌ను కోరారు. అలాగే, రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని, రైల్వే మెయింటెనెన్స్ వర్క్ షాపుతో పాటు గ్రాండ్ ట్రంక్, ఏపీ, తమిళనాడు, వందేభారత్, ఎల్టీటీ, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని, అండర్ పాస్ నిర్మించాలని కోరారు. అలాగే, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, ఇస్లాహే మాషిరా అధ్యక్షుడు ఎక్బాల్ కూడా డీఆర్ఎంను కలిసి మానుకోట రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైల్వే స్టేషన్ తనిఖీ.. డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో డోర్నకల్ చేరుకున్న డీఆర్ఎం రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేశారు. అనంతరం గూడ్స్ యార్డులోని సీ అండ్ డబ్ల్యూ డిపోను తనిఖీ చేశారు. డీఆర్‌యూసీసీ సభ్యులు ఖాదర్, వర్తక సంఘం ప్రముఖులు కాలా మహేందర్జైన్ తదితరులు రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డోర్నకల్‌లో హాల్ట్ కల్పించాలని కోరుతూ డీఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. -
36 మంది బాలకార్మికులకు విముక్తి
● జిల్లాలో ముగిసిన ఆపరేషన్ ముస్కాన్జగిత్యాలక్రైం: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయస్సులో పనిలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు జూలై1నుంచి 31వరకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. బడిబయట ఉన్న 36 మంది చిన్నారులను గుర్తించిన అధికారులు వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కొంతమంది చిన్నారులు ఆర్థికంగా ఇబ్బందులతో తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి బడికి వెళ్లకుండా వెట్టి చాకిరి చేస్తున్న బాలలకు జిల్లా పోలీసు శాఖ, ఐసీడీఎస్ అధికారులు విముక్తి కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అశోక్‌కుమార్ ఒక సబ్‌డివిజన్ పరిధిలో ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక్క మహిళా కానిస్టేబుల్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రతిరోజూ జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటళ్లు, దాబాలు, దుకాణాల్లో, బేకరీల్లో పనిచేస్తున్న 36 మందిని గుర్తించారు. చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలుజిల్లాలో బడీడు పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జూలై 1నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో 36 మందికి విముక్తి కల్పించాం. పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశాం. – అశోక్‌కుమార్, ఎస్పీ, జగిత్యాల జిల్లా -
కానిస్టేబుల్ ఫలితాల్లో మీరావలికి ప్రథమ స్థానం
బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తే తెగుళ్లు దూరం నరసరావుపేట రూరల్: బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు వరి నారుమళ్లకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మంచి విత్తనం నాటితే మంచి దిగుబడి వస్తుందని ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేసి నాటడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు. రైతులకు బీజామృతంతో విత్తన శుద్ధి వలన కలిగే లాభాలను వివరించాలని తెలిపారు. వరి, కూరగాయలు, మిరపతోపాటు ఏ రకమైన విత్తనాలైనా సరే బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు స్వయంగా విత్తన శుద్ధి చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్, ఎన్ఎఫ్ఏ నందకుమార్, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. దుర్గి: ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో మండల పరిధిలోని అడిగొప్పల గ్రామానికి చెందిన అభ్యర్థి షేక్ మీరావలి ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. తల్లిదండ్రులు మస్తాన్‌వలి, సైదాబి వ్యవసాయ పనులు చేస్తుంటారు. కుమారుడు కానిస్టేబుల్‌గా ఎంపిక కావటంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీరావలి మాట్లాడుతూ ప్రథమ స్థానం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. -
ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● క్షయ వ్యాధిగ్రస్తులతో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నిక్షమ్ పోషణ యోజన కింద క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం ప్రతి నెలా రూ.1000 బ్యాంకులో జమ చేస్తోందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వాణిశ్రీ తెలిపారు. దాంతోపాటుగా దాతల సహాయంతో కూడా పోషకాహారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక కోడేవీధిలోని మస్జిద్లో టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపాకాలనీ అర్బన్ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంగకుమార్ యాదవ్ మాట్లాడుతూ రెండు వారాల కంటే ఎక్కువగా జ్వరం రావడం, విడవకుండా దగ్గు వేధించడం, చాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని చెప్పారు. మద్యపానం, ధూమపానం చేసే వ్యక్తులు, మధుమేహంతో బాధపడేవారు, పోషకాహార లోపం కలిగిన వారు ఎక్కువగా క్షయవ్యాధి బారినపడే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని క్షయవ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీపీఎం కోటేశ్వరరావు, టీబీ సూపర్వైజర్ కాలేషా తదితరులు పాల్గొన్నారు. -
కందీలు చిత్రానికి జాతీయ అవార్డు
సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించగా, కందీలు సినిమా అత్యుత్తమ ప్రాంతీయ కన్నడ చలనచిత్రంగా ఎంపికైంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అత్యుత్తమ కన్నడ సినిమా అవార్డును యశోధ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ‘కందీలు– ది రే ఆఫ్ హోప్’ గెలుచుకుంది. ఇది గ్రామీణ ఇతివృత్తం కలిగిన సినిమా. ఒక రైతు, ఆయన కుటుంబం చుట్టూ అల్లిన సున్నితమైన కథ. మడికెరికి చెందిన యశోద ప్రకాశ్ ఈ సినిమాకు దర్శకురాలు. ఈ సినిమా 29వ కోల్‌కతా చిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. యశోద కొడవ భాషలో మూడు, కన్నడలో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ స్క్రిప్టుగా మైసూరుకు చెందిన చిదానంద నాయక్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ఎంపికై ంది. గతంలో ఈ సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవంలో అవార్డును అందుకుంది. -
వెయ్యి ప్రసూతి కిట్ల పంపిణీ
కొరుక్కుపేట: ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా చైన్నె నగర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులకు రూ.10 లక్షల విలువైన వెయ్యి ప్రసూతి కిట్లను రోటరీక్లబ్లు పంపిణీ చేశాయి. సమాజ సేవ, ప్రసూతి ఆరోగ్య సంరక్షణ మద్దతు తెలుపుతూ చైన్నె జిల్లా 3234కి చెందిన 40కి పైగా రోటరీ క్లబ్‌లు, క్లబ్ ఫస్ట్ లేడీస్ ఆర్ఏడబ్ల్యూ 2 (రోటరీ యాక్షన్ ఫర్ ఉమెన్ 2) కలసి ప్రసూతి కిట్ల పంపిణీ చొరవకు చేతులు కలిపాయి. ప్రథమ మహిళ రొటేరియన్ ఉషా సరోగి, డాక్టర్ సుసాన్ వర్గీస్, సీఎస్హెచ్ డైరెక్టర్ సూర్యనారాయణరావు నేతృత్వంలో ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వాస్పత్రుల్లో వెయ్యి ప్రసూతి కిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ ప్రసూతి కిట్లు ప్రసవానికి ముందు, ప్రసవానంతర తల్లులకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రులకు అవసరమైన పరికరాలను విరాళంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. స్థానిక షినాయ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ప్రసూతి కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు.