
కందీలు చిత్రానికి జాతీయ అవార్డు
సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించగా, కందీలు సినిమా అత్యుత్తమ ప్రాంతీయ కన్నడ చలనచిత్రంగా ఎంపికైంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అత్యుత్తమ కన్నడ సినిమా అవార్డును యశోధ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ‘కందీలు– ది రే ఆఫ్ హోప్’ గెలుచుకుంది. ఇది గ్రామీణ ఇతివృత్తం కలిగిన సినిమా. ఒక రైతు, ఆయన కుటుంబం చుట్టూ అల్లిన సున్నితమైన కథ.
మడికెరికి చెందిన యశోద ప్రకాశ్ ఈ సినిమాకు దర్శకురాలు. ఈ సినిమా 29వ కోల్‌కతా చిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. యశోద కొడవ భాషలో మూడు, కన్నడలో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ స్క్రిప్టుగా మైసూరుకు చెందిన చిదానంద నాయక్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ఎంపికై ంది. గతంలో ఈ సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవంలో అవార్డును అందుకుంది.

కందీలు చిత్రానికి జాతీయ అవార్డు