
వెయ్యి ప్రసూతి కిట్ల పంపిణీ
కొరుక్కుపేట: ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా చైన్నె నగర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులకు రూ.10 లక్షల విలువైన వెయ్యి ప్రసూతి కిట్లను రోటరీక్లబ్‌లు పంపిణీ చేశాయి. సమాజ సేవ, ప్రసూతి ఆరోగ్య సంరక్షణ మద్దతు తెలుపుతూ చైన్నె జిల్లా 3234కి చెందిన 40కి పైగా రోటరీ క్లబ్‌లు, క్లబ్ ఫస్ట్ లేడీస్ ఆర్‌ఏడబ్ల్యూ 2 (రోటరీ యాక్షన్ ఫర్ ఉమెన్ 2) కలసి ప్రసూతి కిట్ల పంపిణీ చొరవకు చేతులు కలిపాయి. ప్రథమ మహిళ రొటేరియన్ ఉషా సరోగి, డాక్టర్ సుసాన్ వర్గీస్, సీఎస్‌హెచ్ డైరెక్టర్ సూర్యనారాయణరావు నేతృత్వంలో ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వాస్పత్రుల్లో వెయ్యి ప్రసూతి కిట్‌లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ ప్రసూతి కిట్లు ప్రసవానికి ముందు, ప్రసవానంతర తల్లులకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రులకు అవసరమైన పరికరాలను విరాళంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. స్థానిక షినాయ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ప్రసూతి కిట్‌లను శుక్రవారం పంపిణీ చేశారు.