సాక్షి, చైన్నె : డాక్టర్ ఎంజీఆర్ జానకి మహిళా కళాశాలలో శుక్రవారం విద్యార్థినుల ఆడి పెరుక్కు సందడి కోలాహలంగా జరిగింది. నాలుగు వేల మంది విద్యార్థినులు తమిళ సంప్రదాయానికి అనుగుణంగా ఆడి పెరుక్కును జరుపుకున్నారు. తొమ్మిది రకాల ధాన్యాలు, చిక్కుళ్లు మొలకలతో నిండిన మట్టి కుండలను ఊరేగిస్తూ పూజలు చేశారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో దీపాలను వెలిగించారు. నదీ తీరాల్లో చేసే సంప్రదాయ పద్దతిని అనుసరిస్తూ నిమ్మకాయ, చింతపండు, కొబ్బరితో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ ఉత్సవంలో భాగంగా విద్యార్థినుల దేవరాట్టం, కరగాట్టం, పులియాట్టం, ఒయిలాట్టం, సకై ్కయాట్టం, పోయ్ కాల్ కుదిరై యాట్టం, మైలాట్టం, వంటి నృత్య రూపకాలు సంప్రదాయబద్ధంగా ప్రదర్శించారు. కళాశాల చైర్ పర్సన్ డాక్టర్ కుమార్ రాజేంద్రన్ మాట్లాడుతూ మానవ జాతి పురోగతి సాధించడానికి, శాంతియుతంగా, సంప్రదాయాన్ని పరిరక్షించుకునేందుకు ,మన మూలాలను తెలుసుకోవాల్సిన అవశ్యం ఉందన్నారు. 5 వేల సంవత్సరాల పురాతన సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి, దాని భవిష్యత్తు తరానికి అందించడానికి దోహద పడే విధంగా తాము విద్యార్థినులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, తమిళ సంస్కృతి, సంప్రదాయ పద్ధతులు, సంగీత, నృత్య రూపకాల మేళవింపుతో ఆడిపెరుక్కును కోలాహలంగా విద్యార్థినులు జరుపుకున్నారని వివరించారు.
ఆడిపెరుక్కు సందడి
ఆడిపెరుక్కు సందడి