● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌ పార్కు ● విదేశీ యాత్రకు తమిళ యువత | - | Sakshi
Sakshi News home page

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌ పార్కు ● విదేశీ యాత్రకు తమిళ యువత

Aug 2 2025 7:10 AM | Updated on Aug 2 2025 7:10 AM

● సీఎ

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌

సాక్షి, చైన్నె : స్వచ్ఛ తమిళనాడు లక్ష్యంగా ఒక ప్రత్యేక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రాసెసింగ్‌ రంగంలో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణలో స్వచ్ఛ తమిళనాడు సంస్థ కోసం ఒక కార్యాచరణ రూపకల్పనకు ఐఐటీ మద్రాసుతో సీఎం స్టాలిన్‌ సమక్షంలో శుక్రవారం ఒప్పందాలు జరిగాయి.

తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాల్లో ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజూవారీ ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను నిర్వహించడంలో కీలకమైన అంశంగా మారింది. ఇందుకోసం పరిశుభ్రత ఉద్యమం అనే ఐక్య ఉద్యమంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం స్వచ్ఛ తమిళనాడు ఉద్యమంపై దృష్టి పెట్టారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కింద స్థానిక సంస్థల ద్వారా రాష్ట్రానికి స్థిరమైన వ్యర్థ నిర్వహణ పరిష్కారాల కోసం ఈ కార్యకలాపాలను స్వచ్ఛ తమిళనాడు సంస్థ నిర్వహించే విధంగా దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా, స్వచ్ఛ తమిళనాడు సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను శాసీ్త్రయంగా, అధునాతన పద్ధతిలో శుద్ధి చేయడానికి టెక్నాలజీని ఉపయోగించేందుకు సన్నద్ధమైంది. రీసైకిల్‌ చేయడం, బలమైన ఇంటిగ్రేటెడ్‌ నిర్మాణాన్ని నిర్మించడం కోసం మద్రాసు ఐఐటీతో స్వచ్ఛతమిళనాడు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో సీఎం ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. నిబంధనలకు అనుగుణంగా పునర్వివినియోగం, రీసైక్లింగ్‌ కోసం ఈ అవగాహన ఒప్పందంలో అంశాలను వివరించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌ మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌ యాదవ్‌, స్వచ్ఛ తమిళనాడు కార్పొరేషన్చ్ఛెండీ డాక్టర్‌ ఎస్‌.ఉమ, ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కామకోటి పాల్గొన్నారు.

జర్నలిజం:

చైన్నె ఇన్‌న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం విద్యార్థుల దరఖాస్తుల తేదీని పొడిగిస్తూ సీఎం స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశం దరఖాస్తులకు ఈనెల 3వ తేదీ చివరి రోజు. అయితే, ఈ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులకు ఈనెల పదో తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టెలివిజన్‌, రేడియో , ఆన్‌న్‌లైన్‌ మీడియాలో పనిచేయడానికి అధిక–నాణ్యత విద్య పాఠ్యాంశాలు రూపొందించామని ప్రకటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైన్నె మహానగర అభివృద్ధి సంస్థ తరఫున 4 ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే 26 కొత్త ప్రాజెక్టులకు స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు. మంత్రి శేఖర్‌బాబు పాల్గొన్నారు. తదుపరి జరిగిన కార్యక్రమంలో జాతీయ సహకార చక్కెర మిల్లుల సమాఖ్య ద్వారా మెరుగైన పనితీరు కోసం తమిళనాడులో 5 చక్కెర సహకార సంస్థలు, కర్మాగారాలకు లభించిన అవార్డులను సంబంధిత అధికారులు సీఎం స్టాలిన్‌కు అందజేశారు. మంత్రి రాజేంద్రన్‌ అన్ని అవార్డులను సీఎం స్టాలిన్‌కు సమర్పించారు. అలాగే, పర్యాటక రంగంలో 5 కొత్త ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే, ఎగ్మూర్‌ మ్యూజియం కాంప్లెక్స్‌లో నిర్మించిన కొత్త పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించారు. మంత్రులు స్వామినాథన్‌, రాజేంద్రన్‌ పాల్గొన్నారు. కాగా, గత నెల సీఎం స్టాలిన్‌ అనారోగ్యసమస్యతో తిరుప్పూర్‌ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ఈనెల 11,12 తేదీ జరగనున్నట్టు అధికారులు ప్రకటించారు.

తిరువణ్ణామలైలో మినీ టైడల్‌ పార్కు

తిరువణ్ణామలైలో రూ.37 కోట్లతో కొత్త మినీ టైడల్‌ పార్క్‌ ఏర్పాటు పనులకు సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. 600 కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ఈ మినీ టైడల్‌ పార్కు రూపుదిద్దుకోనుంది. మంత్రులు ఏవీ వేలు, డాక్టర్‌ టీఆర్‌బీ రాజా, పరిశ్రమ శాఖ కార్యదర్శి వి.అరుణ్‌రాయ్‌ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 14 దేశాల్లో ‘తమిళ మూలాల అన్వేషణలో’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎన్‌ఆర్‌ఐ తమిళ యువత కోసం తమిళనాడు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రత్యేక పర్యటన నిమిత్తం ఎంపికై న 99 మంది తమిళ యువకులకు ప్రయాణం, నోట్స్‌, పుస్తకాలు, ఐడీ కార్డులు, వస్త్రాలు, ఇతర సామగ్రిని సీఎం స్టాలిన్‌ పంపిణీ చేశారు. ఇప్పటికే మూడు విడతల పయనం ముగియగా, తాజాగా మలి విడతగా నాలుగో విడతలో 14 దేశాల్లో 99 మంది తమిళుల యువత 16 రోజుల పాటు పర్యటించనున్నారు. మంత్రి నాజర్‌, అధికారులు పాల్గొన్నారు.

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌ 1
1/3

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌ 2
2/3

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌ 3
3/3

● సీఎం సమక్షంలో ఐఐటీతో ఒప్పందం ● తిరువణ్ణామలైలో టైడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement