
కోలీవుడ్‌కు ఐదు జాతీయ అవార్డులు
ఆడి వెళ్లి కోలాహలం
● – అమ్మన్ సన్నిధుల్లో పూజలు
సేలం : ఆషాఢమాసం మూడో శుక్రవారం అమ్మవారి ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. అమ్మవారి సన్నిధుల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అనేక చోట్ల మహిళలు 1008 పాల బిందెలతో ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లారు. ఆడి మాసం(ఆషాఢం) వస్తే చాలు తమిళనాడులో భక్తి భావం మిన్నంటుతుందన్న విషయం తెలిసిందే. ఈ మాసంలో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. భక్తి భావంతో మిన్నంటుతాయి. ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు వదిలి వారి ఆత్మల శాంతికి పూజలు చేస్తారు. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఇంటింటింటా ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఈ మాసంలో మూడో శుక్రవారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా చేశారు. వేకువ జామున అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు జరిగాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయాలకు తరలి వెళ్లి, మొక్కుల్ని తీర్చుకున్నారు.
గ్రామ దేవతల ఆలయాల్లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇళ్లల్లోను ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం చైన్నె, శివారుల్లోని ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండాయి. మైలాపూర్ ముండకన్ని అమ్మన్ ఆలయంలో ఉదయాన్నే అభిషేకం, పసుపు కుంకుమలతో అమ్మవారి అలంకరణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తిరువేర్కాడు కరిమారియమ్మన్ ఆలయం, మాంగాడు కామాక్షి అమ్మవారి ఆలయం, పురసై వాక్కం పాతాల పొన్నియమ్మన్ ఆలయం, కందన్ చావడి కన్నియమ్మన్ ఆలయాల్లోను ప్రత్యేక పూజలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీ నగర్‌లోని వేంబులి అమ్మవారి ఆలయానికి ఆ పరిసరాల్లోని మహిళా భక్తులు 1008 మంది తలపై పాల బందెల్ని ఉంచుకుని ఊరేగింపుగా తరలివచ్చారు. సేలం మారియమ్మన్ ఆలయంలో గాజుల పండుగ జరిగింది. ఆ పరిసరాలలోని అమ్మన్ ఆలయాల్లోని దేవతా మూర్తులను ఒక చోట చేర్చి గాజులతో అలంకరించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

కోలీవుడ్‌కు ఐదు జాతీయ అవార్డులు

కోలీవుడ్‌కు ఐదు జాతీయ అవార్డులు

కోలీవుడ్‌కు ఐదు జాతీయ అవార్డులు