బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Aug 2 2025 7:10 AM | Updated on Aug 2 2025 7:10 AM

బాధ్య

బాధ్యతల స్వీకరణ

తమిళసినిమా: ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం సినీ కళాకారుల ప్రతిభను గౌరవవించేలా జాతీయ అవార్డులను ప్రకటించి, వారిని జ్ఞాపికలతో సత్కరిస్తోంది. ఈ క్రమంలో 2023వ ఏడాదికిగాను 71వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆ పట్టికలో తమిళ చిత్రపరిశ్రమ ఐదు జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం. పార్కింగ్‌ చిత్రం ఏకంగా మూడు అవార్డులఽను గెలుచుకుంది. ప్రాంతీయ భాషలో పార్కింగ్‌ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును, ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకుంది. అలాగే నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించింది. హరీశ్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం పార్కింగ్‌. రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ సంస్థల నిర్వాహకులు సుధన్‌ సుందరమ్‌, కేఎస్‌ శినీష్‌ కలిసి నిర్మించారు. నటుడు ఎంఎస్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రను పోషించిన ఈ చిత్రం 2023లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి ఉత్తమ కథా చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ స్క్రిన్‌ప్లే అవార్డును దర్శకుడు రామ్‌ కుమార్‌ బాలకృష్ణన్‌కు, ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటుడు ఎంఎస్‌ భాస్కర్‌కు అవార్డు వరించింది. అలాగే నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్‌ కుమార్‌కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. అలాగే వీటిల్‌ వింగ్స్‌ అనే డాక్యుమెంటరీ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ఈ సందర్భంగా తనకు జాతీయ అవార్డును ప్రకటించిన జాతీయ అవార్డుల కమిటీకి సంగీత దర్శకుడు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వాత్తీ చిత్రానికి పని చేసే అవకాశం కల్పించినందుకు గాను నటుడు ధనుష్‌కు, ఆ చిత్ర దర్శక నిర్మాతలకు ఇతర యూనిట్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తాను అందుకోనున్న రెండో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

భారత ఆర్మీ దక్షిణ భారత్‌ ఏరియా కొత్త జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ వి శ్రీహరి నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మెరీనా తీరంలోని వార్‌ మెమోరియల్‌వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఆర్మీ వర్గాలు గౌరవ వందనంతో ఆహ్వానం పలికాయి. – సాక్షి, చైన్నె:

బాధ్యతల స్వీకరణ 1
1/4

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ 2
2/4

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ 3
3/4

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ 4
4/4

బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement