క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 2 2025 7:22 AM | Updated on Aug 2 2025 7:24 AM

జాలరి హత్య

అన్నానగర్‌: ఓ జాలరి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రామనాథపురం జిల్లాలోని మండపం సేతునగర్‌కు చెందిన ధనశేఖరన్‌ కుమారుడు కలంజియం(49) మత్స్యకారుడు. ఇతనికి భార్య, 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ వివాదం కారణంగా, కలంజియం కొన్నేళ్లుగా తన భార్య, కొడుకు నుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మండపం రైల్వే రోడ్డు ప్రాంతంలోని సూపర్‌ మార్కెట్‌ ముందు పడుకుని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో, ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి అతడిని కత్తిని మెడ కోసేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కార్మికురాలి దుర్మరణం

తిరువొత్తియూరు: చైన్నె తాంబరం సమీపంలో కారు ఢీ కొని గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు శుక్రవారం ఉద యం మృతి చెందారు. తాంబరం సమీపం సిద్ధా లపాక్కం ప్రాంతానికి చెందిన ఏలుమలై. అతని భార్య రాణి( 30) తాంబరం మున్సిపల్‌ కార్పొరేషనన్‌లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. గత ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో రాణి ఇతర పారిశుద్ధ్య కార్మికులు తూర్పు తాంబరం, వేళచ్చేరి రోడ్డులో చెత్తను తొలగిస్తున్నారు. ఆ సమయంలో రాణి రోడ్డు పక్కన నిలబడి ఉండగా మేడవాక్కం నుంచి తాంబరం వైపు వస్తున్న ఒక కారు అకస్మాత్తుగా రోడ్డు పక్కన ని లబడి ఉన్న రాణిని వేగంగా ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాల య్యాయి. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన తోటి కార్మికులు వెంటనే ఆమెను క్రోమ్‌పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం చైన్నె రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ రాణికి చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పల్లికరనై ట్రాఫిక్‌ పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.

విద్యార్థులకు లైంగిక వేధింపులు

– మతబోధకుడి అరెస్టు

తిరువళ్లూరు: ట్యూషన్‌కు వచ్చిన బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసిన మతబోధకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని బమ్మత్తుకుళం ప్రాంతానికి చెందిన కామరాజ్‌ అలియాస్‌ విక్టర్‌(54). ఇతను అదే ప్రాంతంలో క్రైస్తవ చర్చీని నిర్వహిస్తూ మతబోధనలు చేస్తున్నాడు. ఇతడి భార్య సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్నారు. సాయంత్రం సమయంలో స్థానికంగా ఉన్న పిల్లలకు ట్యూషన్‌ చెబుతున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్‌కు వచ్చే చిన్నపిల్లలు, బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు తెలు స్తుంది. దీంతో బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పి వారి ద్వారా సెంగుడ్రం మ హిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్టర్‌ను అరెస్టు చేశారు.

16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

తిరువొత్తియూరు: బాలికపై లైంగిక దాడి చేసి గర్భిణి చేసిన కూలిని పోలీసులు పొక్సో చట్టం కింద అరెస్టు చేశారు. సేలం జిల్లా ఏర్కాడ్‌ కోవిలూర్‌ ప్రాంతానికి చెందిన వివేక్‌ (21) చెట్లు నరికే కూలీగా పనిచేస్తాడు. ఇతడు గత మార్చి నెలలో ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టి ప్రాంతంలోని బంధువుల ఇంట్లో జరిగిన విందుకు వచ్చాడు. ఆ సమ యంలో అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో వివేక్‌ ఆ బాలికకు ఆశ మాటలు చెప్పి, లైంగిక దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం దెబ్బతిన్న బాలికను ఆమె తల్లిదండ్రులు ధర్మపురి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి, ఆ బాలిక 5 నె లల గర్భిణి అని తెలిపారు. అది విని తల్లిదండ్రు లు దిగ్భ్రాంతి చెందారు. బాలిక గర్భానికి కారణం వివేక్‌ అని తెలిసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వివేక్‌ను అరెస్టు చేశారు.

ముగిసిన నాలుగు రోజుల కస్టడీ

తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పాఠశాల బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడిని నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీ విచారణ ముగిసిన క్రమంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరు పరిచి, ఈనెల 8 వరకు రిమాండ్‌ విధించడంతో పుళల్‌ జైలుకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని ఆరంబాక్కం ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక గత 12న పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 13 రోజుల తరువాత ఆంధ్రాలోని సూళూరుపేట రైల్వేస్టేషన్‌లో నిందితుడిని అరెస్టు చేశా రు. అనంతరం గత శనివారం పూందమల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్ళి హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించిన క్రమంలో పుళల్‌ జైలు కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితు డు ఒడిశాకు చెందిన రాజూబిష్మవర్మ(35)గా గు ర్తించారు. నిందితుడుని ఆరంబాక్కం పోలీసులు ఏడు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ గత సోమవారం పోక్సో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థా నం విచారణకు స్వీకరించింది. కేసును న్యాయ మూర్తి ఉమామహేశ్వరి విచారించి నాలుగు రో జులు కస్టడీకి ఇచ్చారు. పోలీసులు నిందితుడిని ఆరంబాక్కం, సూళూరుపేటకు తీసుకెళ్లి విచారణ చేశారు. కస్టడి ముగిసిన క్రమంలో శుక్రవారం భారీ బందోబస్తు నడుమ తిరువళ్లూరు కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం నిందితుడ్ని పుళల్‌ జైలుకు తరలించారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement