
కంటి వెద్యశిబిరానికి విశేష స్పందన
తిరువొత్తియూర్: రాజన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఎస్‌కేపీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కళాశాల కరస్పాండెంట్ వూటుకూరు శరత్‌కుమార్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ పీబీ వనిత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవీ నప్పిన్నై. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి.భరణికుమారి తదితరులు పాల్గొ ని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఎస్‌కేపీసీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఎస్‌కేపీడీ బాలుర పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌కేపీడీ చారిటీస్ సభ్యులు సహా 350 మందికి పైగా ప్రయోజనం పొందారు. అవసరమైన వారికి కళ్ల అద్దాల పంపిణీ చేశారు.