
దేశ వ్యాప్త విస్తరణపై దృష్టి
సాక్షి, చైన్నె: దేశ వ్యాప్తంగా విస్తరణపై మాక్స్‌ఫ్రెష్ దృష్టి పెట్టినట్టు ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు.స్టెయిన్ లెస్–స్టీల్ వంట సామగ్రిలో ప్రీమియం బ్రాండ్‌లకు పేరుగడించిన మాక్స్‌ఫ్రెష్, వైబ్రాంట్ ఇండియా 2025 ఎక్స్‌పో చైన్నె ట్రేడ్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 3వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో అన్ని రకాల కిచెన్ సొల్యూషన్స్ సామగ్రి శ్రేణిని కొలువుదీర్చారు. వంట సామగ్రి, గృహోపకరణలు, గిఫ్ట్ డెకర్ బ్రాండ్‌లతో గృహాలకు అవసరమైన అన్ని రకాల వస్తువులను ఒకే చోట ప్రదర్శనలో ఉంచారు. ఈసందర్భంగా ఎక్స్‌పోలో ట్రిపుల్ కుక్ వేర్, స్టీమర్‌లతో బహుముక లైనప్‌ను ప్రదర్శించారు.