టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు
బుచ్చిబాబు టోర్నీ సందర్భంగా గాయపడిన సూర్య.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు
ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి ముంబైకి వచ్చిన సూర్య.. కుటుంబంతో కలిసి గణేషుడి పూజ చేశాడు
భార్య దేవిశా శెట్టితో కలిసి గణనాథుని పూజించి.. ఇంట్లోనే నిమజ్జనం చేశాడు
ఇందుకు సంబంధించిన వీడియోను సూర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు
బంగ్లాదేశ్‌తో అక్టోబరులో మొదలయ్యే టీ20 సిరీస్‌కు సూర్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది


