టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉద్వేగానికి లోనయ్యాడు
తన కుమారుడు అంగద్ ‘డాడా’ అని కలవరిస్తున్నాడంటూ భార్య సంజనా పెట్టిన పోస్టుకు రియాక్ట్ అయ్యాడు
తన గారాలపట్టిని తానూ ఎంతో మిస్ అవుతున్నానంటూ.. తన హృదయం ద్రవించిపోతోందని పేర్కొన్నాడు
కాగా బుమ్రా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు
చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టాడు
అనంతరం కాన్పూర్ వేదికగా రెండో టెస్టుకు సిద్ధమవుతున్నాడు
అయితే, ప్రస్తుతం బుమ్రా ఇంటికి దూరంగా ఉన్న నేపథ్యంలో అతడి భార్య సంజనా ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది
బుమ్రాను చాలా మిస్ అవుతున్నాం.. మా బుడ్డోడు కూడా డాడా అని కలవరిస్తున్నాడు.. నా మనసు మెలిపడుతోంది అంటూ పేర్కొంది
ఇందుకు బదులుగా ఆ స్టోరీని బుమ్రా సైతం షేర్ చేశాడు
కాగా స్పోర్ట్స్' ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో బుమ్రాకు 2021లో వివాహం జరిగింది
ఈ జంటకు 2023, సెప్టెంబరులో కుమారుడు అంగద్ జన్మించాడు


