టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెరమీదకు వచ్చింది.
భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ బంధం బీటలు వారిందనేది దాని సారాంశం.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటాషా గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అన్నట్లుగా ‘రెడిట్’ ఓ పోస్ట్ పెట్టింది.
ఈ క్రమంలో కొంత మంది హార్దిక్- నటాషా విడిపోనున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు.
అయితే, వారి అభిమానులు మాత్రం ఇవన్నీ వట్టి వదంతులే అని కొట్టి పారేస్తున్నారు.
హార్దిక్, అతడి కుటుంబంతో నటాషా దిగిన ఫొటోలు ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
అయితే, ఈ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు.
తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
నటాషా ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని.. భరణం కింద హార్దిక్ ఆస్తి (స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం రూ. 91 కోట్లు)లో 70 శాతం ఆమెకు దక్కనుందని రూమర్లు వ్యాపిస్తున్నాయి.
అయితే, ఈవిషయంపై హార్దిక్- నటాషాలలో ఎవరూ స్పందించలేదు.
కాగా సెర్బియా మోడల్ అయిన నటాషాను పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు?
2020లో వీరి వివాహం జరిగింది. అప్పటికే నటాషా గర్భవతి.
వీరికి కుమారుడు అగస్త్య ఉన్నాడు.
అయితే, వైభవంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పాండ్యా- నటాషా 2023 వాలంటైన్స్ డే సందర్భంగా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు.


