టాలీవుడ్ బ్యూటిఫుల్ జంటల్లో వరుణ్- వితికా ఒకరు. వీరిద్దరూ 2015లో వచ్చిన పడ్డానండీ ప్రేమలో మరి సినిమాలో కలిసి నటించారు.
టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ హీరోహీరోయిన్లు నిజంగానే లవ్‌లో పడ్డారు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.
ప్రస్తుతం వితికా సినిమాలకు దూరంగా ఉంటోంది కానీ వరుణ్ మాత్రం మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు.
పడ్డానండీ ప్రేమలో మరి సినిమా వచ్చి నేటికి (ఫిబ్రవరి 14కు) పదేళ్లవుతున్న సందర్భంగా వితికా ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
పదేళ్ల క్రితం వచ్చిన పడ్డానండీ ప్రేమలో మరి సినిమాలో మేము కలిసి నటించడమే కాదు మా లవ్‌స్టోరీకి పునాది వేశాం.
రీల్ లవ్ నుంచి రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యాం.
అప్పటినుంచి ఇప్పటివరకు మా జీవితంలో చోటు చేసుకున్న అన్ని విషయాలకు నేనెంతగానో గర్విస్తున్నాను.
సినిమాలో జోడీ కట్టిన మేము నిజ జీవితంలోనూ జత కడతామని ఎవరికి తెలుసు? ఈ చిత్రంతోనే మా ప్రయాణం మొదలైంది.
మా ప్రేమ బంధానికి పదేళ్లు అని రాసుకొచ్చింది.
వరుణ్-వితికా 2016లో పెళ్లి చేసుకున్నారు.


