నయనతార హీరోయిన్‌గా నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విఘ్నేశ్ (విక్కీ) దర్శకత్వం వహించాడు
ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్ పేరిట రిలీజైంది. అప్పుడు ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది
2022 జూన్ 9న వీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు
ఇకపోతే వీరి మధ్య లవ్ పుట్టడానికి ఒకరకంగా ధనుషే కారణమంటున్నాడు విక్కీ
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది
మొదట్లో ఒప్పుకోని విజయ్ సేతుపతి నయన్ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు
ఈ సినిమా వల్ల నయన్‌కు ఎక్కువ సమయం కేటాయించాను
తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం అని చెప్పాడు
నానుమ్ రౌడీ ధాన్ మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు


