అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్.
ఇందులో చై మత్య్సకారుడిగా నటిస్తున్నాడు.
ఈ పాత్ర కోసం చై.. మత్య్సకారుల జీవితాల్ని దగ్గరి నుంచి పరిశీలించాడు.
వారితో పరిచయం ఏర్పడిన సమయంలో.. మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అని షూటింగ్ ప్రారంభంలో మత్య్సకారులకు మాటిచ్చాడట!
అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.
కట్టెల పొయ్యిపై చేపల పులుసు వండాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.


