

నాగచైతన్య.. టాలీవుడ్లో కూల్ అండ్ కామ్ గా ఉండే యంగ్ హీరో.

తండ్రి నాగార్జున స్టార్ హీరో కావడంతో ఇండస్ట్రీలోకి సులభంగానే వచ్చేశాడు.

కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్, లుక్స్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత పేరు తెచ్చుకున్నాడు.

అతడే నాగచైతన్య. ఈరోజు (నవంబర్ 23) చైతూ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

నాగార్జున, లక్ష్మి దంపతుల సంతానం నాగచైతన్య. ప్రముఖ నిర్మాత రానా నాయుడు కుమార్తెనే లక్ష్మీ.

మనస్పర్థలు కారణంగా లక్ష్మీ నుంచి నాగార్జున విడాకులు తీసుకున్నాడు. కానీ చైతూతో మాత్రం మంచి రిలేషన్ ఉంది.

అలా అటు అక్కినేని, ఇటు రామానాయుడు ముద్దుల మనవడిగా నాగచైతన్య గుర్తింపు తెచ్చుకున్నాడు.

కెరీర్లో చాలామంది కొత్త దర్శకులకు అవకాశమిచ్చాడు. కాకపోతే హిట్స్ కంటే ప్లాఫ్స్ వచ్చాయి.

ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తున్నాడు. 'తండేల్' అనే రియల్ లైఫ్ స్టోరీతో త్వరలో రాబోతున్నాడు.

'ఏ మాయ చేశావె' సినిమాలో తనతో పాటు హీరోయిన్గా చేసిన సమంతని ప్రేమించాడు.

2017లో వీళ్లు పెళ్లి చేసుకోగా.. మనస్పర్థలు వచ్చిన నాలుగేళ్లకే అంటే 2021లో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సింగిల్‌గానే ఉన్న చైతూ.. ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యాడు.

డిసెంబర్ 4న చైతూ-శోభిత పెళ్లి.. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరగనుంది.

అలా పెళ్లికి ముందు పుట్టినరోజు కాబట్టి చైతూకి ఈ ఏడాది బర్త్ డే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.

సినిమాలు, యాక్టింగ్ పక్కనబెడితే 'సోయూ' అనే రెస్టారెంట్‌కి నాగచైతన్య ఓనర్.

అలానే స్పోర్ట్స్ కార్స్, రేసింగ్ అన్నాసరే చైతూకి చాలా ఇష్టం. మొన్నీమధ్య తన టీమ్.. కారు రేసింగ్‌లో విజయం సాధించింది.

ఎంత పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూల్ అండ్ స్వీట్‌గా ఉండటం నాగచైతన్యకే చెల్లింది.