బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్, భార్య అంకితతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లాడు.
సతీసమేతంగా పవిత్రస్నానం ఆచరించాడు.
మౌని అమావాస్య వంటి పవిత్రమైన రోజున మహాకుంభమేళాకు రావడం అదృష్టమని పొంగిపోయాడు.
నటుడు మిలింద్.. భార్య అంకిత మధ్య 26 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటం గమనార్హం.
మిలింద్.. ఆవారా సహా పలు సౌత్ చిత్రాల్లో నటించాడు.
ఎక్కువగా హిందీ చిత్రాల్లో యాక్ట్ చేశాడు.


