మెగాస్టార్ చిరంజీవి మరో వసంతంలోకి అడుగుపెట్టేశారు
ప్రస్తుతం కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి వయసు 69 ఏళ్లు
పశ్చిమ గోదావరిలోని మెగల్తూరులో పుట్టి పెరిగిన చిరు.. టాలీవుడ్‌కే టార్చ్ బేరర్ అయ్యారు
సరే చిరంజీవి సినిమాలు, సాధించిన ఘనతల గురించి కొత్తగా చెప్పడానికేం లేదు
కానీ ఇప్పటివరకు చాలామందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయం మాత్రం చెప్పుకొందాం
చిరు పుట్టినరోజు అంటే కొత్త సినిమా ప్రారంభోత్సవం లేదంటే అప్‌డేట్స్ ఎక్కువగా వస్తుంటాయి
కానీ పుట్టినరోజునే చిరంజీవి ఇన్నేళ్ల కెరీర్‌లో ఒకేఒక్క సినిమా రిలీజ్ చేశారు. అదే 'చంటబ్బాయ్'
1986లో ఇది రిలీజైంది. కాకపోతే ఇమేజ్‌కి భిన్నంగా పూర్తిగా కామెడీ స్టోరీతో దీన్ని తీశారు
దీంతో అభిమానులకు 'చంటబ్బాయ్' పెద్దగా ఎక్కలేదు. దెబ్బకు చిరు సినిమా ఫ్లాప్ అయిపోయింది
అదే ఏడాది చిరంజీవి మొత్తం ఎనిమిది సినిమాలు చేస్తే.. వాటిలో రాక్షసుడు, కొండవీటి రాజా మాత్రమే హిట్ అయ్యాయి
అలా పుట్టినరోజున ఓ సినిమా రిలీజ్ చేస్తే, అది జనాలకు నచ్చకపోవడంతో చిరంజీవి డిసప్పాయింట్ అయ్యారు
ఈ క్రమంలోనే పుట్టినరోజున పోస్టర్, టీజర్, ప్రారంభోత్సవం లాంటివి మాత్రమే చేస్తున్నారు!
ప్రస్తుతం చిరంజీవి.. 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. వచ్చే సంక్రాంతికి విడుదల
సరే ఇదంతా పక్కనబెడితే చిరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం


