టాలీవుడ్ నటి అభినయ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది.
తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)ను పెళ్లాడింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 16న ఆమె పెళ్లి ఘనంగా జరిగింది.
తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఇది చూసిన అభిమానులు అభినయకు అభినందనలు చెబుతున్నారు.
ఈ నెల 20న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.


