నిర్మల్: మూడురోజులుగా చారిత్రక, సాంస్కృతిక కళావైభవాన్ని చాటుతున్న నిర్మల్ ఉత్సవాలకు భారీగా స్పందన వస్తోంది
							జిల్లా ప్రజల కోరిక మేరకు వేడుకలను మరోరోజు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు
							మూడురోజులపాటే నిర్వహిస్తామని చెప్పిన ఉత్సవాలను మరోరోజు పొడిగించడానికి ప్రజా దరణ రోజురోజుకూ పెరగడమే కారణం
							కళా కారులు, విద్యార్థినుల సాంస్కృతిక సంబురం అంబరాన్నంటింది
							మూడోరోజూ ఫుడ్‌స్టాళ్ల వద్ద సందడి కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గణిత, సామాన్యశాస్త్రాల ఆధారంగా పెట్టిన ఆటలు చిన్నారులను ఆకట్టుకున్నాయి
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
