ఆంధ్రా ఊటీ అరకులోయలో నిర్వహించిన అరకు చలి ఉత్సవ్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది
గత నెల 31 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి
మూడు రోజులపాటు నిర్వహించిన వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
ప్రముఖ సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మంగ్లీ గీతాలాపన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది
ఉత్సవాల చివరిరోజు జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలకు తిలకించేందుకు అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు


