శీతల ప్రదేశాల్లోని ప్రజలకు కేన్సర్‌!

People living in cold regions at higher risk of cancer - Sakshi

జెరూసలేం: శీతల ప్రదేశాల్లో నివసించేవారికి కేన్సర్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. డెన్మార్క్, నార్వే వంటి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే దేశాల్లోని జనాల్లో ఎక్కువ మంది కేన్సర్‌ బారినపడినవారున్నట్లు ఓ అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. శీతల ప్రదేశాలతోపాటు ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారికి కేన్సర్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని సైప్రస్‌ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త కోన్‌స్టాంటినస్‌ ఓస్కరైడ్స్‌ వెల్లడించారు.

ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు మనుషుల్లోని రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ మేరకు ప్రాంతాల ఉష్ణోగ్రతలు, ప్రజల్లో కేన్సర్‌ ప్రమాదం మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులోభాగంగా ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేన్సర్‌ కేసుల వివరాలను అధ్యయనం చేసినట్లు కోన్‌స్టాంటినస్‌ చెప్పారు. శీతల, ఎత్తయిన ప్రదేశాల్లోని ప్రజలు ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్‌ బారిన అధికంగా పడుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించినట్లు తెలిపారు.  

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top