మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు.
సాక్షి, వరంగల్: మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరకు సోమవారం కూడా భారీగా తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. తల్లుల గద్దెల వద్ద నిలువెత్తు బెల్లం సమర్పించుకుంటున్నారు. లక్షల సంఖ్యలో వచ్చిన జనంతో మేడారం జనగూడారంలా మారింది. జంపన్నవాగు స్నాన ఘట్టాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రాకతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.