
‘ఇంటిపంట’ల ఉత్పాదకత 15 రెట్లెక్కువ!
పొలాల్లో కూరగాయల ఉత్పాదకత కన్నా ఇంటి పెరట్లో/భవనాలపైన కుండీలు, మడుల్లో సాగు చేసే కూరగాయల ఉత్పాదకత 15 రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆహార సంస్థ(ఎఫ్‌ఏఓ) గణాంకాల ప్రకారం..
పొలాల్లో కూరగాయల ఉత్పాదకత కన్నా ఇంటి పెరట్లో/భవనాలపైన కుండీలు, మడుల్లో సాగు చేసే కూరగాయల ఉత్పాదకత 15 రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆహార సంస్థ(ఎఫ్‌ఏఓ) గణాంకాల ప్రకారం.. ఇంటిపట్టున చదరపు మీటరు విస్తీర్ణంలో ఏడాదికి 20 కిలోల ఆహారాన్ని పండించవచ్చు. ఎఫ్‌ఏఓ ఇంకా ఏమన్నదంటే..
- ఇంటిపంటల సాగు వల్ల దూరం నుంచి ఆహారోత్పత్తుల్ని పట్టణాలు, నగరాలకు తరలిం చాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు ఇంధనం ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. పోషక విలువలతో కూడిన తాజా సహజాహారం లభిస్తుంది.
- కూరగాయల సాగు కాలం తక్కువ. కొన్ని రకాలైతే విత్తిన 60 రోజుల్లోనే దిగుబడినిస్తాయి. అందువల్లే పట్టణాలు, నగరాల్లో సాగుకు అనుకూలం.
- ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 80 కోట్ల మంది కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. పట్టణాల్లో నివసి స్తున్న అల్పాదా య వర్గాల ప్రజలు కూర గాయలు, ఆకు కూరలను తమ కున్న కొద్ది పాటి చోటు లో పండిం చుకుంటూ ఆహా రంపై ఖర్చును తగ్గించుకుం టున్నారు.
- పట్టణాల పరిసరాల్లో సాగయ్యే కూరగాయలు, పండ్ల తోటల్లో ప్రతి వంద చదరపు మీటరుకు ఒకరికి చొప్పున ఉపాధి దొరుకుతుంది.
ఫేస్‌బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’!
‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్‌బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. ఫేస్‌బుక్‌లో INTIPANTA - Organic Kitchen/Terrace Gardening గ్రూప్ ఉంది.
గూగుల్ గ్రూప్ అడ్రస్: https://groups.google.com/ forum/#!forum/intipanta
intipanta@googlegroups.comకు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు.