రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపీనాథ్ ముండేకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపీనాథ్ ముండేకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నివాళులర్పించారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ముండే పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
దేశం ఓ గొప్ప నాయకున్ని కోల్పోయిందని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గోపీనాథ్ ముండే ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ముండే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.