స్వలింగ భాగస్వామిని కాల్చిచంపిన యువకుడు | Youth kills his gay partner after latter attacks his mother | Sakshi
Sakshi News home page

స్వలింగ భాగస్వామిని కాల్చిచంపిన యువకుడు

Oct 4 2014 7:32 PM | Updated on Sep 2 2017 2:20 PM

ఇద్దరు స్వలింగ భాగస్వాముల మధ్య జరిగిన ఘర్షణలో 18 ఏళ్ల యువకుడు తన భాగస్వామిని కాల్చి చంపాడు.

ఇద్దరు స్వలింగ భాగస్వాముల మధ్య జరిగిన ఘర్షణలో 18 ఏళ్ల యువకుడు తన భాగస్వామిని కాల్చి చంపాడు. వాళ్లిద్దరి మధ్య సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని.. సదరు యువకుడి తల్లిపై ఆ రెండో భాగస్వామి దాడి చేయడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడి తల్లికి, చనిపోయిన వ్యక్తికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దాంతో అతడు ఆమెను చంపబోతుండగా ఈ యువకుడు అతడిని కాల్చి చంపాడని పోలీసు ఇన్స్పెక్టర్ పి.డి. పర్మార్ చెప్పారు. అహ్మదబాద్ బాపునగర్ ప్రాంతంలోని చున్వల్ నగర్ మురికివాడలో ఈ సంఘటన జరిగింది.

సంఘటనకు ముందు హతుడు చేతిలో రివాల్వర్ పట్టుకుని నిందితుడి తల్లిని బెదిరించాడని, అతడు చంపుతాడన్న భయంతో ఈ యువకుడు అతడి చేతుల్లోంచి నాటు తుపాకిని లాక్కుని మూడు రౌండ్ల కాల్పులు జరిపాడని, దాంతో అతడు అక్కడికక్కడే మరణించడని పోలీసులు తెలిపారు. వారిద్దరి మధ్య ఏడాది కాలంగా సంబంధం ఉంది. నిందితుడి తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడైన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement