'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా' | Will move court if Ram temple is not built by 2016, says Subramanian Swamy | Sakshi
Sakshi News home page

'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'

Feb 1 2015 10:25 PM | Updated on Sep 2 2017 8:38 PM

'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'

'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'

అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

మాథూరా: అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. 2016లో రామమందిరం నిర్మాణం ప్రారంభించకపోతే కోర్టుకెక్కడం సహా ఇతర మార్గాలు ఎంచుకుంటామని ఆయన చెప్పారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్లేయులు రూపొందించిన సిలబస్ నే ఇప్పటికీ విద్యాలయాల్లో బోధిస్తున్నారని, దీన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతమున్న హిందూ జనాభాను రాజకీయ పార్టీలు చీల్చాయని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement