 
															మోడీ కోసం వెయ్యి రాఖీలు
వారణాసిలోని పలు ఆశ్రమాల్లో గడుపుతున్న వితంతు మహిళలు కొందరు ప్రధాని, సోదర సమానుడైన మోడీ కోసం వెయ్యి రాఖీలు తయారు చేసే పనిలో పడ్డారు.
	వారణాసి: రక్షాబంధన్(రాఖీ) పండుగ ఈ సారి ప్రధాని మోడీకి ప్రత్యేకం కానుంది. అంతేకాదు జీవిత భాగస్వాములను కోల్పోయి మలిదశలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారణాసి మహిళలకు కూడా ప్రత్యేక ఆనందాన్ని తెచ్చిపెట్టనుంది.
	
	మోడీ వారణాసి ఎంపీ అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారణాసిలోని పలు ఆశ్రమాల్లో గడుపుతున్న వితంతు మహిళలు కొందరు ప్రధాని, సోదర సమానుడైన మోడీ కోసం వెయ్యి రాఖీలు తయారు చేసే పనిలో పడ్డారు. తమ  సోదరుడు(మోడీ)కి వెయ్య రాఖీలు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బిర్లా ఆశ్రమంలో ఉంటున్న వితంతు మహిళ ఒకరు చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
