కళ్లు తెరిచిన పశ్చిమ ప్రపంచం! | Western world Open the eyes! | Sakshi
Sakshi News home page

కళ్లు తెరిచిన పశ్చిమ ప్రపంచం!

Aug 9 2014 4:50 PM | Updated on Mar 29 2019 8:33 PM

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ - Sakshi

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ

భారతదేశం అన్ని రంగాలలో సాధిస్తున్న అభివృద్దిని చూసి పశ్చిమ ప్రపంచం కళ్లు తెరిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

న్యూఢిల్లీ: భారతదేశం అన్ని రంగాలలో సాధిస్తున్న అభివృద్దిని చూసి పశ్చిమ ప్రపంచం కళ్లు తెరిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. బిజెపి విజయం సాధించిన తరువాత జరుగుతున్న ఈ తొలి సమావేశానికి ఆ పార్టీ అగ్రనేతలతోపాటు ఆ పార్టీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

అణుప్రయోగం చేస్తామంటే ప్రపంచం అంతా ఆగ్రహంతో ఊగిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాల ఆర్ధిక ఆంక్షలకు ఎదురొడ్డి భారత్ ముందుకు వెళుతోందని చెప్పారు. ప్రపంచ వేదికలపై భారత్కు సమప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు.  

పార్టీ కంటే దేశమే తమకు ముఖ్యం అన్నారు.  ప్రపంచ పటంలో భారత్కు మంచి గుర్తింపు ఉండాలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు. అధికారంలోకి వచ్చినా ఇదే సూత్రాన్ని తాము పాటిస్తున్నట్లు తెలిపారు.  కార్యకర్తల కష్టార్జితమే బిజెపి విజయమన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటామని మోడీ చెప్పారు.

పార్టీ అధ్యక్షుడు అమిత్షా గురించి తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసునని చెప్పారు. అతను  బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలరన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement