యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ: జైపాల్రెడ్డి | we won't accept hyderabad as union territory: s jaipal reddy | Sakshi
Sakshi News home page

యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ: జైపాల్రెడ్డి

Nov 26 2013 3:28 PM | Updated on Sep 2 2017 1:00 AM

యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ: జైపాల్రెడ్డి

యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ: జైపాల్రెడ్డి

హైదరాబాద్‌ను యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తెలిపారు.

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేయడానికి వంద శాతం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటుపై న్యాయపరమైన అంశాల గురించి షిండేతో చర్చించినట్టు తెలిపారు.

రాయల తెలంగాణపై తమ ప్రాంత నేతలతో మాట్లాడి చెప్తానని అన్నారు. డిసెంబర్‌ 20 కల్లా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కొద్ది రోజుల్లోనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అవకాశముందని జైపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement