న్యాయవ్యవస్థపై నమ్మకముంది: రావుల
ఓటుకు నోటు వ్యవహారంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డికి బెయిల్ లభించడంపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి మంగళవారం హైదరాబాద్లో స్పందించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డికి బెయిల్ లభించడంపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి మంగళవారం హైదరాబాద్లో స్పందించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. రేవంత్కు బెయిల్ లభించడంతో న్యాయమే గెలిచిందని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతునే ఉన్నామని రావుల చంద్రశేఖరరెడ్డి గుర్తు చేశారు.
టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంగళవారం మంజురు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పై విధంగా స్పందించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
