విగ్రహంపై కలెక్టర్‌ అమ్రపాలి మండిపాటు | Sakshi
Sakshi News home page

విగ్రహంపై కలెక్టర్‌ అమ్రపాలి మండిపాటు

Published Sun, Aug 27 2017 1:14 AM

విగ్రహంపై కలెక్టర్‌ అమ్రపాలి మండిపాటు

వరంగల్‌: అత్యుత్సాహంతో కొందరు యువకులు చేసిన పనిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి మండిపడ్డారు. నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటకు చెందిన యువకులు కొందరు.. ‘అమ్రపాలి ఒడిలో వినాయకుడు’ కాన్సెప్ట్‌తో విగ్రహాన్ని తయారుచేసి, ఆ ఫొటోలు, వీడియోలను శుక్రవారం ‘హమారా వరంగల్‌’ ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. నిమిషాల వ్యవధిలోనే అవి వైరల్‌ కావడంతో అధికారిణి స్పందించారు.

తన ప్రతిమను తయారుచేయడం పట్ల కలెక్టర్‌ అమ్రపాలి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే దానిని తొలగించాలంటూ సిబ్బందికి సూచించారు. అప్పటికే విషయం తెలుసుకున్న యువకుల బృందం తాము తయారు చేయించిన విగ్రహానికి నల్లరంగు పూసి, అక్కడి నుంచి తరలించారు. దీంతో ఈ వ్యవహారం సర్దుమణిగింది.
(కలెక్టర్‌ అభ్యంతరం తర్వాత విగ్రహానికి నల్ల రంగు పూస్తోన్న దృశ్యం)

 

Advertisement
Advertisement