దుర్గాశక్తిపై తాజాగా విచారణ | UP orders fresh probe in Durga Nagpal case | Sakshi
Sakshi News home page

దుర్గాశక్తిపై తాజాగా విచారణ

Aug 30 2013 11:41 AM | Updated on Sep 1 2017 10:17 PM

సస్పెన్షన్ వేటు పడిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అంశంపై తాజాగా విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ససెప్షన్ వేటు పడిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అంశంపై తాజాగా విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ సర్కార్ గురువారం అర్థరాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆ అంశంపై రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.ఎం.శ్రీవాత్సవ విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు పేర్కొంది.

 

ఆయన నేతృత్వంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందచేయాలని సూచించింది. దుర్గాశక్తి సస్పె న్షన్పై ఆమె ఇచ్చిన నివేదికపై అఖిలే సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ సర్కార్ తాజాగా ఆ ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ బుద్ధ నగర్లోని కదల్పూర్ గ్రామంలోని నిర్మాణంలో ఉన్న మసీద్ గోడను కూల్చివేసేందుకు ఆమె ఆదేశాలు జారీ చేయడాన్ని అఖిలేష్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

 

ఆమె జిల్లా మేజిస్ట్రేట్గా తీసుకున్న ఆ నిర్ణయం మతసామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉందని ఆ సర్కార్ అభిప్రాయపడ్డింది. దాంతో ఆమెపై ససెప్షన్ వేటు వేసింది. దుర్గాశక్తి నాగపాల్ను అఖిలేష్ సర్కార్ సస్పె న్షన్ చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement