
మహిళలు, అమ్మాయిలు ఎక్కువ టైం గడిపేది ఎలాగో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు సామూహికంగా తమ విలువైన సమయాన్ని కుటుంబ అవసరాలకోసం నీటి సేకరించేందుకు కేటాయిస్తున్నారట. ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల నిధి సంస్థ యూనిసెఫ్ ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలు , అమ్మాయిలు ఎక్కువ సమయాన్ని ఎందుకు వెచ్చిస్తున్నారో తెలుసా? సామూహికంగా తమ విలువైన సమయాన్ని కుటుంబ అవసరాలకోసం నీటి సేకరించేందుకు కేటాయిస్తున్నారట. ఈ మాటను స్వయంగా ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల నిధి సంస్థ యూనిసెఫ్ ప్రకటించింది. నీటి సేకరణలో మహిళలు, పిల్లలు ప్రధానంగా అమ్మాయిల పాత్ర, కోల్పోతున్న సమయం, అవకాశాలు తదితర అంశాలపై ఐక్యరాజ్యసమితి విభ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. సుమారు 200 మిలియన్(రెండుకోట్ల) గంటల్ని రోజువారీ నీటికోసం వినియోగిస్తున్నారని యూనిసెఫ్ అధ్యయనంలో తేలింది. రెండుకోట్ల గంటలు అంటే ఎనభై లక్షల 30వేలకు పైగా గంటలు.. 22, 800 సంవత్సరాలు. ఇది రాతియుగంలో ఖాళీ బకెట్ మొదలైన ఓ మహిళ ప్రయాణం 2016 దాకాసాగినా నీటి బకెట్ తో ఇంటికి చేరకపోవడంతో సమానమని ఆయన లెక్కలు చెప్పారు. ఈ సమయంలో ప్రపంచం ఎంత ముందంజలో ఉందో, మహిళలు ఎంత సాధికారత సాధించి ఉండేవారో గమనించాలని కోరారు. ఇలా మహిళలు, బాలికలు తమ జీవితంలోని చాలా అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు.
ప్రపంచ నీటి వారం ముగిసిన సందర్భంగా ఈ అధ్యయనాన్ని సంస్థ వెల్లడించింది. భారతదేశంలోని లక్షలాది మంది బాలికలు నీటిని సేకరించడానికి కష్టపడుతున్నారని యూనిసెఫ్ వాటర్, శానిటేషన్ అండ్ హై జీన్ గ్లోబల్ హెడ్ సంజయ్ విజేసేకర తెలిపారు. మానవమనుగడకు కీలక వనరు అయిన నీటి కొరత, లభ్యత అవకాశాలలపై అధ్యయనం నిర్వహించిన సంస్థ ఈ ఆశ్చర్యకర విషయాలను వెలుగులోకి తెచ్చింది. 24 ఉప-సహారా దేశాలలో ఈ అధ్యయనం జరిగింది. గృహాలకు పైప్ లద్వారా నీటి సరఫరా కానంతవరకు మహిళలపైన, పిల్లల పై ముఖ్యంగా బాలికలపై అనివార్యంగా పడుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆసియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై ఒక్క నిమిషాలు, పట్టణ ప్రాంతాల్లో 19నిమిషాలు పడుతోందని గుర్తించింది. ఈ క్రమంలో 3.36 మిలియన్ల అమ్మాయిలు , 13.54 మంది మహిళలు నీటి సేకరణ బాధ్యత భారాన్ని మోస్తున్నారని అంచనావేసింది. మాలావి లో పురుషులు కేవలం 6 నిమిషాల ఖర్చు చేయగా స్త్రీలు సగటున 54 నిమిషాలు కేటాయించారని అధ్యయనం తేల్చింది. 2030నాటికి ప్రపంచవాప్తంగా ప్రజలందరికీ సమానమైన సురక్షితమైననీటి వసతి అందుబాటులోకి రావాలని యూనిసెఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ పిలుపు నిచ్చింది.