కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ | Two years' bonus for central government employees: Jaitley | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

Aug 30 2016 4:37 PM | Updated on Sep 4 2017 11:35 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో పండుగ వాతావరణాన్ని అపుడే నింపేసింది. గత రెండు సం.రాలుగా పెండింగ్ లో ఉన్న బోనస్ చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు.

న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో  పండుగ వాతావరణాన్ని అపుడే నింపేసింది.  గత రెండు సం.రాలుగా  పెండింగ్ లో ఉన్న బోనస్  చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు.  ఈ డబుల్ బొనాంజాతో దాదాపు  33 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.   రెండు సంవత్సరాలుగా  పెండింగ్లో  ఉన్న తమ  వార్షిక బోనస్  చెల్లించేందుకు అంగీకరించడంతో ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునగనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన నిబంధనల ప్రకారం  2014-15 ,  2015-16  సం.రాల  బోనస్  విడుదల  కానుంది.   తరువాత ఇది  7 వ వేతన సంఘం కింద పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  విలేఖరులకు చెప్పారు.


 

Advertisement
 
Advertisement
Advertisement