టంబుల్స్ ట్రబుల్స్ పరార్ | Troubles tambuls parar | Sakshi
Sakshi News home page

టంబుల్స్ ట్రబుల్స్ పరార్

Nov 21 2015 3:28 AM | Updated on Sep 3 2017 12:46 PM

టంబుల్స్ ట్రబుల్స్ పరార్

టంబుల్స్ ట్రబుల్స్ పరార్

ఈ బుజ్జి కుక్కపిల్లను చూశారా.. ఎంచక్కా చక్రాలు కట్టుకుని తిరుగుతోందో..

ఈ బుజ్జి కుక్కపిల్లను చూశారా.. ఎంచక్కా చక్రాలు కట్టుకుని తిరుగుతోందో.. పుట్టుకతోనే కాళ్లు కోల్పోయిన ఈ కుక్క పిల్ల పేరు టంబుల్స్. రెండు నెలల వయసున్న ఈ టంబుల్స్‌ను అమెరికాలోని ఒహాయోకు చెందిన కారెన్, పిచర్ జంట పెంచుకోవాలనుకుంది. అయితే దీనికి కాళ్లు లేకపోవడంతో తల్లడిల్లిన ఆ జంట ఏదైనా చేయాలనుకుంది. వెంటనే బుల్లి చక్రాల కుర్చీ డిజైన్ చేశారు. ఆ తర్వాత ఒహాయో యూనివర్సిటీలో ఉన్న ఇన్నోవేషన్ సెంటర్‌లో త్రీడీ ప్రింటర్ ద్వారా చక్రాలు తయారు చేయించారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా దీన్ని తయారు చేసేందుకు దాదాపు 14 గంటలు పట్టిందట.

Advertisement
 
Advertisement
Advertisement