వైద్యుని ఇంట్లో మూడు హత్యలు | Triple murder at doctor's house | Sakshi
Sakshi News home page

వైద్యుని ఇంట్లో మూడు హత్యలు

Oct 14 2014 5:39 PM | Updated on Jul 30 2018 9:21 PM

ఓ వైద్యుని ఇంట్లో ముగ్గురు హత్య చేయబడ్డ ఘటన నగరంలోని ఖందగిరి విహార్ లో కలకలం సృష్టించింది.

భువనేశ్వర్:ఓ వైద్యుని ఇంట్లో ముగ్గురు హత్య చేయబడ్డ ఘటన నగరంలోని ఖందగిరి విహార్ లో కలకలం సృష్టించింది. ఎముకల వైద్యునిగా పనిచేస్తున్న అతుల్యా చంద్రా మెహర్ ఇంట్లోకి ఓ దుండగుడు చాకచక్యంగా ప్రవేశించి అతనికి సంరక్షకునిగా ఉన్న కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ తో పాటు, మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

 

డాక్టర్ మెహ్రా ఇంటి క్రింది భాగంలో పనివాళ్లు ఉండే నివాసంలో ప్రశాంత్ బెహ్రాతో పాటు అతని భార్య, కుమారుడు ఉంటున్నారు. ఆ దుండగుడు ప్రశాంత్ భూషణ్ తో పాటు, భార్య, కుమారుడిపై దాడి చేశాడు. దీంతో తొలి అంతస్తులో ఉన్న మెహర్ క్రింది అంతస్తులో అలజడిని గ్రహించి అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఆ అపరిచిత వ్యక్తి డాక్టర్ పై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ చంద్రా మోహర్ , ప్రశాంత్ బెహ్రా తో పాటు అతని కుమారుడు కూడా మృతి చెందాడు.  కాగా, బెహ్రా భార్య ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమెను ఎస్సీబీ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement